World AIDS Day 2023: హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసుకోలేరు. చాలా మంది దీని బారిన పడ్డా ఏండ్ల తర్వాతే తమకు ఈ వ్యాధి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ వ్యాధి మొదట్లో ఎలాంటి లక్షణాలను చూపించదు. హెచ్ఐవీ ఉన్న వ్యక్తికి ఎటువంటి లక్షణాలు లేనప్పటికీ వైరస్ ను ఇతరులకు వ్యాప్తిచేయొచ్చు. హెచ్ఐవీ ఉన్నవారు సంక్రమణ తర్వాత కేవలం వారాల్లోనే వైరస్ ను మరింత సులభంగా ఇతరులకు వ్యాప్తి చేస్తారు. అసలు ఈ హెచ్ఐవీ ఎయిడ్స్ రావడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూకేలో హెచ్ఐవి నిర్ధారణ అయిన చాలా మంది అసురక్షిత యోని లేదా ఆనల్ సెక్స్ ద్వారే వైరస్ బారిన పడ్డారట. అలాగే అసురక్షిత ఓరల్ సెక్స్ ద్వారా హెచ్ఐవీ కూడా వస్తుందని నిపుణులు అంటున్నారు. కానీ ప్రమాదం చాలా తక్కువ.
ఎవరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
ఓరల్ సెక్స్ లో పాల్గొన్న వారికి హెచ్ఐవీ ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఎక్కవుగా ఉంటుంది. నోటి పూతల, పుండ్లు లేదా చిగుళ్ళ నుండి రక్తస్రావం వంటి సమస్యలు వీళ్లకు ఎక్కువగా వస్తాయి. వీటి నుంచే వైరస్ వీరితో సెక్స్ లో పాల్గొన్న వారికి వస్తుంది.
హెచ్ఐవీ భాగస్వామినికి కలిగున్న వ్యక్తులు.
హెచ్ఐవీ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి చెందిన ప్రస్తుత లేదా మునుపటి భాగస్వామి ఉన్న వ్యక్తులు
హెచ్ఐవీ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు
పురుషులతో అసురక్షిత శృంగారంలో పాల్గొనే పురుషులు
పురుషులతో అసురక్షిత శృంగారంలో పాల్గొనే మహిళలు
మాదకద్రవ్యాలను ఇంజెక్ట్ చేసే, పరికరాలను పంచుకునే వ్యక్తులు
మాదకద్రవ్యాలు ఇంజెక్ట్ చేసిన, పరికరాలను పంచుకున్న వ్యక్తితో అసురక్షిత సెక్స్ లో పాల్గొన్న వ్యక్తులు
హెచ్ఐవి సోకిన వ్యక్తితో సెక్స్ టాయ్స్ ను పంచుకునే వ్యక్తులు
లైంగిక సంక్రమణ అంటువ్యాధులు, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి చరిత్ర ఉన్న వ్యక్తులు
ఎక్కువ మంది లైంగిక భాగస్వాములను కలిగి ఉన్న వ్యక్తులు
అత్యాచారానికి గురైన వ్యక్తులు
హెచ్ఐవి కోసం బలమైన స్క్రీనింగ్ లేని దేశాలలో రక్త మార్పిడి, ఇతర ప్రమాద-సంభావ్య విధానాలను పొందిన వ్యక్తులు
సోకిన వ్యక్తి వాడిని సూదిని ఉపయోగించిన వ్యక్తులు
చికిత్స చేయని హెచ్ఐవి ఉన్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు
హెచ్ఐవి ఎలా వ్యాప్తి చెందుతుంది
హెచ్ఐవి ఒకరి నుంచి మరొకరికి సులభంగా ఏం వ్యాప్తి చెందదు. ఇది జలుబు, ఫ్లూ వైరస్ ల మాదిరిగా గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదు. హెచ్ఐవి రక్తంలో, కొన్ని శరీర ద్రవాలలో నివసిస్తుంది.
ఏ శరీర ద్రవాల ద్వారా వైరస్ వ్యాపిస్తుంది
వీర్యం
రుతుస్రావ రక్తం
యోని ద్రవాలు
చనుబాలు
రక్తం
అయితే లాలాజలం, చెమట లేదా మూత్రం వంటి ఇతర శరీర ద్రవాలు మరొక వ్యక్తికి సోకడానికి తగినంత వైరస్ ను కలిగి ఉండవు.
వైరస్ రక్తప్రవాహంలోకి ప్రవేశించే ప్రధాన మార్గాలు:
హెచ్ఐవీ సోకిన వ్యక్తి ఉపయోగించిన సూదులు లేదా ఇంజెక్ట్ పరికరాలను ఉపయోగించడం.
పాయువు, యోని, జననేంద్రియాలపై లేదా లోపల సన్నని పొర ద్వారా
నోరు, కళ్ల సన్నని పొర ద్వారా
చర్మంలో కోతలు, పుండ్లు ద్వారా
హెచ్ఐవీ ఇలా వ్యాపించదు
ఉమ్మి వేయడం
ముద్దు
తుమ్ములు
స్నానం, టవల్స్ లేదా దువ్వెనను పంచుకోవడం
అవే మరుగుదొడ్లు లేదా స్విమ్మింగ్ పూల్స్ ఉపయోగించడం
జంతువులు లేదా దోమలు వంటి కీటకాలతో సంపర్కం