టీ ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Jun 8, 2024, 1:47 PM IST

టీ, కాఫీలను తాగే అటవాటు చాలా మందికి ఉంటుంది. చాలా మంది రోజుకు మూడు, నాలుగు సార్లైనా టీని తాగుతుంటారు. కానీ టీని ఎక్కువగా తాగితే ఎన్ని సమస్యలొస్తాయో తెలుసా?
 

milk tea

 టీని మిల్క్ టీ అని చాయ్ అని కూడా అంటారు. ఇండియాలో ఇది చాలా ఫేమస్ డ్రింక్. చాలా మంది టీని ఉదయం నిద్రలేచిన వెంటనే తాగుతారు. అలాగే మధ్యాహ్నం సాయంత్రం అంటూ రోజుకు ఐదారు సార్లు తాగే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఆఫీసుల్లో పనిచేసేవారు టీని ఎక్కువగా తాగుతుంటారు. టీ మన ఏకాగ్రతను పెంచుతుంది. యాక్టీవ్ గా చేస్తుంది. అందుకే చాలా మంది టీని బాగా తాగుతుంటారు. కానీ టీని ఎక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా. 

మలబద్ధకం

మలబద్దకం చిన్న సమస్యేం కాదు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనిలో టీని ఎక్కువగా తాగడం కూడా ఒకటి. అవును టీని ఎక్కువగా తాగడం వల్ల శరీరం పొడిగా, నిర్జలీకరణానికి గురవుతుంది. ఇది మల విసర్జనను మరింత కష్టతరం చేస్తుంది.
 


ఆత్రుత

టీ ఆందోళన లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు టీని ఎక్కువగా తాగడం మానుకోవాలి. 

నిద్రలేమి

టీలో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. దీన్ని తక్కువ మొత్తంలో తీసుకోవడం వచ్చే సమస్యలేం లేవు. కానీ ఎక్కువగా తీసుకుంటేనే లేనిపోని సమస్యలు వస్తాయి. టీని ఎక్కవుగా తాగితే నిద్రలేమి సమస్య వస్తుంది. అందుకే సాయంత్రం 6 తర్వాత టీని తాగకూడదని నిపుణులు అంటారు. 

రక్తపోటులో హెచ్చుతగ్గులు

అధిక రక్తపోటు గుండెపోటు, స్ట్రోక్ సమస్యలకు దారితీస్తుంది. అందుకే రక్తపోటు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మిల్క్ టీ ని ఎక్కువగా తాగడం వల్ల రక్తపోటులో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మీ గుండెను రిస్క్ లో పడేస్తుంది. 

నిర్జలీకరణం

శరీరం డీహైడ్రైట్ అయితే ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది. మీకు తెలుసా? మిల్క్ టీలో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తాగితే మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. డీహైడ్రేట్ ఒక్కోసారి మన ప్రాణాలను కూడా తీసేయగలదు. అందుకే టీని ఎక్కువగా తాగకూడదు. 


తలనొప్పి

తలనొప్పి చిరాకు కలిగిస్తుంది. ఇది ఒక్కోసారి గంటల నుంచి రోజుల వరకు ఉంటుంది. తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే మిల్క్ టీ ఎక్కువగా తాగడం వల్ల మన శరీరం డీహైడ్రేషన్ కు గురవుతుంది. ఫలితంగా తలనొప్పి వస్తుంది. 

ఉబ్బరం

టీ లోని కెఫిన్ కంటెంట్ మంటను కలిగిస్తుంది. మిల్క్ టీని ఎక్కువగా తాగితే ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. ఇది కడుపు అసౌకర్యం, కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది.

Latest Videos

click me!