సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా?

First Published | Jun 7, 2024, 2:25 PM IST

అప్పటి వరకు బాగానే ఉండి ఉన్నపాటుగా కుప్పకూలి గుండెపోటుతో చనిపోతున్న ఘటనలు భయాన్ని కలిగిస్తున్నాయి. క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తున్న సడెన్ గా కుప్పకూలి చనిపోతున్నారు. దీనికి గుండెపోటే కారణం. కానీ దీన్ని చాలా మంది గమనించరు. అసలు ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? 
 

silent heart attack

సైలెంట్ హార్ట్ ఎటాక్ చాలా డేంజర్. చాలాసార్లు వారాలు లేదా నెలల తర్వాతే గుండె ఆరోగ్యం దెబ్బతిన్నది అన్న సంగతి కూడా తెలియదు. దీన్ని గుర్తించడానికి లక్షణాలు కూడా కనిపించవు. ఇదే గుండెను మరింత రిస్క్ లో పడేస్తుంది. ఇలా ఎక్కువగా సైలెంట్ హార్ట్ ఎటాక్ విషయంలోనే జరుగుతుంది. సైలెంట్ హార్ట్ ఎటాక్ కూడా ఇతర గుండెపోటుల మాదిరిగానే నష్టాన్ని కలిగిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా అంచనా వేయబడిన 8,05,000 గుండెపోటు కేసుల్లో 1,70,000 నిశ్శబ్ద గుండెపోటు బారిన పడ్డారు. 

Image: Getty Images

సైలెంట్ హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తులకు గుండెల్లో మంట, జ్వరం లేదా ఛాతీ కండరాలలో బిగుతుగా అనిపిస్తుంది. ఇవి సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు కావొచ్చు.  సైలెంట్ హార్ట్ ఎటాక్ గుండెకు వెళ్లే రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. అలాగే గుండె కండరాలకు నష్టం కలిగిస్తుంది.
 


silent heart attack


అయితే సైలెంట్ హార్ట్ ఎటాక్ వల్ల ఖచ్చితంగా ఛాతీ నొప్పి లేదా శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అసలు సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

silent heart attack

హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు మీ శరీరమంతా ప్రభావితమవుతుంది. అలాగే మీకు నొప్పిగా, అసౌకర్యం కూడా ఉంటుంది. రెండు లేదా ఒక చేతులు, మెడ, దవడ, పొత్తికడుపులో అసౌకర్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు. ఇవి సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు. 


అయితే ఈ లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతుంటాయి. ఇది ఛాతీపై బరువుగా లేదా నొప్పిని కలిగిస్తుంది. ఏదేమైనా ఈ లక్షణాలను మర్చిపోకూడదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మరేదైనా సమస్య వల్ల  మీకు మైకంగా అనిపించడం కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ కు సంకేతమే కావొచ్చు. 
 


ఎప్పుడూ వికారంగా అనిపించడం, వాంతులు అవడం జ్వరం లక్షణాలు. అయితే ఇవి నిశ్శబ్ద గుండెపోటుకు సంకేతాలు కూడా. ఇవి జ్వరం లేదా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఒత్తిడికి గురవడం వల్ల వచ్చాయని లైట్ తీసుకోవడానికి బదులుగా జాగ్రత్తగా ఉండటం మంచిది. 


మీకు సాధారణం కంటే చెమటలు ఎక్కువగా పడుతుంటే.. ముఖ్యంగా మీరు వ్యాయామం చేయకపోయినా లేదా ఏ పనీ చేయకపోయినా చెమటలు విపరీతంగా పట్టినట్టైతే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది ముందస్తు గుండెపోటు లక్షణం కావొచ్చు. మూసుకుపోయిన ధమనుల ద్వారా రక్తాన్ని పంప్ చేయడానికి మీ గుండె ఎక్కువ శ్రమ పడుతుంది. గుండెపై భారం ఎక్కువగా కావడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత తగ్గి ఎక్కువ చెమటలు పడతాయి. చెమటలతో మీరు తడిసిపోతే వెంటనే హాస్పటల్ కు వెళ్లండి. 

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలను తీసుకువెళ్లడానికి తగినంత రక్తం లభించనప్పుడు గుండెపోటు అని పిలిచే సైలెంట్ హార్ట్ వస్తుంది. రక్తం లేకపోవడం వల్ల గుండెపోటు వస్తుందని. 

వయస్సు, వంశపారంపర్య లేదా జన్యుపరమైన సమస్యలు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, ఊబకాయం, పేలవమైన ఆహారం, మందును ఎక్కువగా తాగడం, ఒత్తిడి, శారీరక నిష్క్రియాత్మకత, జంక్ ఫుడ్, రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం గుండెపోటుకు ప్రధాన ప్రమాద కారకాలు.

Latest Videos

click me!