కాఫీని ప్రపంచ వ్యాప్తంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఉదయం లేవగానే.. వేడి వేడిగా కమ్మని వాసన వెదజల్లే కాఫీని తాగితే కలిగే అనుభూతి మరెందులోనూ రాదు అనే చెప్పాలి. ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ అందించే రుచి.. మరే ఇతర కాఫీల్లో ఉండదనే చెప్పాలి. అయితే.. మన ఫిల్టర్ కాఫీ.. మన మనసులను మాత్రమే కాదు.. ప్రపంచ మనసు గెలిచింది. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 10 కాఫీల జాబితా ని టేస్ట్ అట్లాస్ సంస్థ రీసెంట్ గా విడుదల చేయగా.. అందులో మన ఫిల్టర్ కాఫీ టాప్ 2లో ఉండటం విశేషం.
ఇన్ స్టాంట్ కాఫీ ఎవరైనా కలిపేస్తారు. కానీ ఫిల్టర్ కాఫీ చేయడం అనేది ఒక కళ. అది అందరికీ సాధ్యం కాదు. ఉదయం లేవగానే ఒక కప్పు ఫిల్టర్ కాఫీ తాగినా.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు. అంతేనా మళ్లీ మళ్లీ తాగాలి అనే కోరిక కలుగుతుంది. అందుకే.. టేస్ట్ అట్లాస్ సంస్థ విడుదల చేసిన టాప్ 10 బెస్ట్ కాఫీల్లో మన కాఫీ కి కూడా చోటు దక్కింది. మరి మన ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
నిజమైన సంతృప్తికరమైన ఫిల్టర్ కాపి అనేది అనేక కారకాల ఫలితంగా ఉంది: బీన్స్ ఎంపిక, రోస్ట్, బ్లెండ్, గ్రైండ్, బ్రూయింగ్ విధానం ఇలా అన్నీ కరెక్ట్ గా ఉన్నప్పుడే ఫిల్టర్ కాఫీ బాగుంటుంది. . మొదటి కప్పు కాఫీని సృష్టించడానికి సాంప్రదాయ బ్రూయింగ్ ప్రక్రియలో ప్రతి దశను ఖచ్చితంగా అమలు చేయాలి.
Filter Coffee
పర్ఫెక్ట్ ఇండియన్ ఫిల్టర్ కాఫీని ఎలా తయారు చేయాలంటే..
చాలా మంది కాఫీ ఔత్సాహికులు ఎంతో ఇష్టపడే ఫిల్టర్ కాఫీ రెండు నిమిషాల్లో చేసేయలేం. నెమ్మదిగా తయారుచేసే ఈ కాఫీ స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా కాపర్ వడపోతను ఉపయోగించి తయారు చేస్తారు. సాధారణంగా రెండు స్థూపాకార మెటల్ కంపార్ట్‌మెంట్లు ఒకదానిపై ఒకటి పేర్చబడి ఉంటాయి. ఎగువ గదిని (రంధ్రాలు ఉన్నది) కొన్ని సెకన్లపాటు వేడి చేయడం ద్వారా ప్రారంభిస్తారు. ఆపై దిగువ కంపార్ట్‌మెంట్‌పై ఉంచాలి.. 1-2 టేబుల్ స్పూన్ల మెత్తగా గ్రౌండ్ కాఫీని జోడించండి. సుమారు 1/4 కప్పు నీటిని రోలింగ్ కాచుకు తీసుకురండి, ఆపై దానిని ఫిల్టర్‌లో పోయాలి. మూత పెట్టాలి. కొన్ని నిమిషాలు అలానే ఉంచితే.. డికాషన్ కిందకు దిగుతుంది.
ఈలోగా పాలు కాచుకొని ఉంచుకోవాలి. వాటిని ఒక టంబ్లర్‌లో పోయాలి. మీ రుచికి తగినంత పంచదార లేదా బెల్లం వేసుకోవచ్చు. ఇప్పుడు.. వీటిని డికాషన్ తో కలిపేయడమే. రెండు, మూడుసార్లు తిరగపోస్తే..చక్కగా నురగతో వస్తుంది. కమ్మని ఫిల్టర్ కాఫీ రెడి అయిపోయినట్లే.