రోజుకు ఒక అరటిపండును తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ తగ్గిపోతయ్..

Published : Oct 09, 2023, 01:56 PM IST

మనమందరం ప్రతిరోజూ తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

PREV
17
రోజుకు ఒక అరటిపండును తిన్నా చాలు.. ఈ సమస్యలన్నీ తగ్గిపోతయ్..

మనమందరం ప్రతిరోజూ తినే పండ్లలో అరటిపండ్లు ఒకటి. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం. అరటిపండ్లలో ఫైబర్, పొటాషియం, ఫోలేట్ మరియు విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

27

పండ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిలో మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండల్లో అరటి పండు ఒకటి. అరటి కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండెను చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ పొటాషియం అధిక రక్తపోటును తగ్గించి గుండెను సేఫ్ గా ఉంచుతుంది. ఒక మీడియం సైజ్ అరటిపండు మన రోజువారీ పొటాషియం అవసరంలో 10 శాతం అందిస్తుంది.
 

37

అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పండని అరటి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 30 ఉంటుంది. అదే పండిన అరటిలో అయితే ఈ విలువ 60గా ఉంటుంది. దీన్ని తిన్నంత మాత్రాన రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా పెరిగిపోవు. మధుమేహులు అరటి పండ్లను ఎలాంటి భయాలు లేకుండా తినొచ్చు. అయితే బాగా పండిన అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. 

47
banana

అరటిపండ్లలో డోపామైన్, కాటెచిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ మానసిక స్థితిని మెరుగ్గా ఉంచడానికి సహాయపడతాయి. అంతేకాదు కాదు ఈ పండ్లలో కరిగే, కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్స్ జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. అలాగే కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. అతిగా ఆకలి అయ్యే అవకాశాన్ని తగ్గిస్తాయి. అందుకే బరువు తగ్గాలనుకునే వారు అరటిపండ్లు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవచ్చు. 

57

ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. యూకేలోని లీడ్స్ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. అరటిపండ్లు వంటి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, కొరోనరీ హార్ట్ డిసీజ్ లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

67

అరటి పండులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీస్, నియాసిన్, మెగ్నీషియం, ఫోలేట్, రిబోఫ్లేవిన్, విటమిన్ బి 6 వంటి పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మన శరీరం సక్రమంగా పనిచేయడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
 

77

అరటిపండ్లలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య ఉన్నవారికి సహాయపడుతుంది. రోజుకు ఒక అరటిపండును తింటే రక్తహీనత సమస్య తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత అలసట, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలకు దారితీస్తుంది. 

Read more Photos on
click me!

Recommended Stories