యువరాజ్ సింగ్ బయోపిక్... రేసులో ఇద్దరు స్టార్ హీరోలు! ఎవరు బాగా సెట్ అవుతారు?

First Published | Aug 22, 2024, 4:51 PM IST

ఒకప్పటి స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ కి తెరపైకి వచ్చింది. ఆయన పాత్ర చేసేందుకు ఇద్దరు స్టార్ హీరోల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఎవరు బెస్ట్ ఛాయిస్ అనే చర్చ నడుస్తోంది.. 
 


భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ ఇటీవల ప్రకటించడంతో క్రికెట్ అభిమానులు చాలా ఉత్కంఠగా ఉన్నారు. MS ధోనీ ,సచిన్ టెండూల్కర్ ల బయోపిక్‌లు సక్సెస్ కాగా, యువరాజ్ సింగ్ బయోపిక్ కి సమయం వచ్చింది. 2011 ICC క్రికెట్ ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించడంలో యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. జట్టు కోసం ఆడుతున్నప్పుడు, యువరాజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు క్యాన్సర్ ని ఓడించడానికి ఆయన సంవత్సరాల పాటు పోరాడాడు. 

క్రికెటర్ యువరాజ్ సింగ్ స్ఫూర్తిదాయక జీవితంపై, అతని విజయాలు, కృషిని తెలియజేసేలా టి-సిరీస్ బయోపిక్‌ను నిర్మిస్తుట్లు ప్రకటించింది. ఈ చిత్రంలో యువరాజ్ పాత్ర చేసేందుకు ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి ఇద్దరు నటులను అభిమానులు కోరుకుంటున్నారు. 

రణవీర్ సింగ్

టాలెంటెడ్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పాత్రను పోషించడానికి రణ్‌వీర్ సింగ్ ప్రస్తుతం పోటీలో ఉన్నాడు. రణ్‌వీర్ 2021లో విడుదలైన  '83' చిత్రంలో భారత మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్ పాత్రను పోషించాడు. సహజంగా నటించి మెప్పించాడు. 


విక్కీ కౌశల్


యువరాజ్ సింగ్ పాత్రను పోషించడానికి పోటీలో ఉన్న మరో టాలెంటెడ్ యాక్టర్  విక్కీ కౌశల్. సర్దార్ ఉధమ్, సామ్ మానెక్‌షా వంటి అద్భుతమైన నిజ జీవిత పాత్రలను విక్కీ పోషించాడు. విక్కీ కౌశల్ యువరాజ్ పాత్రకు గ్రేట్ ఛాయిస్ అనే వాదన ఉంది. అలాగే కొందరు అభిమానులు టైగర్ ష్రాఫ్ క్రికెటర్‌ యువరాజ్ సింగ్ గా నటించాలని డిమాండ్ చేస్తున్నారు. 

యువరాజ్ సింగ్  తన బయోపిక్ పై స్పందిస్తూ...  "ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా లక్షలాది మంది అభిమానులకు నా కథను చూపించడం నాకు చాలా గౌరవంగా ఉంది. క్రికెట్ నాకు గొప్ప ప్రేమను, ఆటుపోట్లను ఎదుర్కునే బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎలా ఎదిరించి నిలబడాలనే స్ఫూర్తిని ఇతరులకు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను", అన్నారు


ఈ బయోపిక్ టైటిల్, నటీ నటులు, సాంకేతిక నిపుణుల పేర్లు చిత్ర నిర్మాతలు వెల్లడించలేదు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, రవి భగచాంద్క నిర్మిస్తున్నారు. యువరాజ్ బయోపిక్ పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.  

Latest Videos

click me!