Tamannah Marriage: గుడ్ న్యూస్ చెప్పనున్న మిల్కీ బ్యూటీ తమన్నా? అలా హింట్ ఇచ్చేసిందా!

First Published | Jan 28, 2024, 10:36 AM IST


స్టార్ బ్యూటీ తమన్నా భాటియా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి ఆమె లేటెస్ట్ ఫోటోలు కారణం అయ్యాయి. ఆ కథేమిటో చూద్దాం... 
 

Tamannah Bhatia

తమన్నా భాటియా చిత్ర పరిశ్రమకు వచ్చి రెండు దశాబ్దాలు అవుతుంది. తెలుగులో ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. హ్యాపీ డేస్ మూవీతో వెలుగులోకి వచ్చిన తమన్నా... 100 % లవ్ చిత్రంతో స్టార్డమ్ తెచ్చుకుంది. 

తెలుగులో టాప్ హీరోలందరితో సినిమాలు చేసింది. కోలీవుడ్ లో కూడా రాణించింది. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్స్ పక్కన కూడా తమన్నా నటించింది. సుదీర్ఘకాలం ఆమె స్టార్డమ్ అనుభవించారు. 
 


Tamannah Bhatia


కొన్నాళ్లుగా వరుసబెట్టి వెబ్ సీరిస్లు చేస్తుంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్డా సిరీస్లలో తమన్నా బోల్డ్ రోల్స్ చేసింది. లిప్ లాక్ లు, బెడ్ రూమ్ సన్నివేశాల్లో మొహమాటం లేకుండా నటించింది. హిందిలో అడపాదడపా చిత్రాలు చేస్తుంది. 

Tamannah Bhatia

కాగా ప్రస్తుతం తమన్నా నటుడు విజయ్ వర్మతో రిలేషన్ లో ఉంది. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ అనేక పుకార్లు వచ్చాయి. సదరు కథనాలను మొదట్లో ఇద్దరూ ఖండించారు. గత ఏడాది ఫైనల్ గా ఓపెన్ అయ్యారు. అవును మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం... అని క్లారిటీ ఇచ్చారు. 

Tamannah Bhatia


ప్రియుడిని పరిచయం చేసిన నాటి నుండి తమన్నా పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది తమన్నా-విజయ్ వర్మ పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. ఈ క్రమంలో తమన్నా గౌహతి లోని కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించడం చర్చకు దారి తీసింది. 

Tamannah Bhatia

కుటుంబ సభ్యులతో పాటు కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన తమన్నా... డివోషనల్ లుక్ ఆకట్టుకుంది. చెప్పాలంటే ఆమె గుర్తు పట్టలేనంతగా తయారైంది. పెళ్లికి సిద్ధం అవుతున్న తమన్నా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. త్వరలో గుడ్ న్యూస్ చెప్పనుంది కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే తమన్నా పెళ్లి పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. 

Latest Videos

click me!