మరోసారి ఆయన డైరెక్షన్ లో నటించబోతున్న పాయల్ రాజ్ పుత్? హిట్ పక్కానేగా!

First Published | Feb 23, 2023, 6:13 PM IST

యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) మరోసారి హిట్ బాటలో నడవబోతోంది. తన కేరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ సినిమాలో మరోసారి నటించబోతున్నట్టు తెలుస్తోంది. 
 

పంజాబీ బ్యూటీ, క్రేజీ హీరోయిన్ పాయల్ రాజ్ పూత్ కొద్దికాలంగా హిట్ లేక కొట్టుమిట్టాడుతోంది. వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నా ఆశించిన మేర ఫలితాలనివ్వడం లేదు. దీంతో సినిమాపై కాస్తా గట్టిగానే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 

తెలుగు, హిందీ, పంజాబీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వస్తున్నా.. యంగ్ బ్యూటీ కేరీర్ ను స్పీడ్ పెంచేందుకు ఏమాత్రం ఉపయోగడటం లేదనే చెప్పాలి. గతేడాది పాయల్ నటించిన మూడూ చిత్రాలు అంతంతమాత్రనే సందడి చేశాయి. ఇక తెలుగులో వచ్చిన జిన్నా చిత్రం మరీ డిజాస్టర్ గా నిలిచింది. 
 


పాయల్ రాజ్ పూత్ తన కెరీర్‌ని టీవీ సీరియల్ యాక్ట్రెస్ గా ‘సప్నోన్ సే భరే నైనా’తో ప్రారంభించింది. ఆతర్వాత మరిన్ని సీరియల్స్ లోనూ నటించి మెప్పింది. ఆ తర్వాత పంజాబీ చిత్రంలోనూ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం అన్నీ భాషల్లో నటిస్తోంది. 

అయితే, వరుసగా ఫ్లాప్స్ ను అందుకుంటున్న ఈ బ్యూటీ మరోసారి హిట్ బాటలో నడవబోతున్నట్టు తెలుస్తోంది. తన కేరీర్ ను మలుపు తిప్పిన డాషింగ్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

RX100 సినిమాలో అజయ్ భూపతి డైరెక్షన్  లో నటించి హిట్ అందుకున్న పాయల్.. మరోసారి ఆయన దర్శకత్వంలోనే నటించబోతున్నట్టు తెలుస్తోంది. కాస్తా బ్రేక్ ఇచ్చిన అజయ్ భూపతి ఓ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. ‘మంగళవారం’ అనే చిత్రంతో తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారని తెలుస్తోంది.

ఆ సినిమా లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో  పాయల్ రాజ్ పూత్ ను ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అందలేదు. కానీ ఈవేరకు వస్తున్న వార్తలతో పాయల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం తమిళంలో ‘గోల్ మాల్’, ‘ఏంజెల్’, తెలుగులో ‘కిరాతక’ వంటి చిత్రాల్లో నటిస్తోంది.  

Latest Videos

click me!