ప్రభాస్ ని అనుష్క మరీ దారుణంగా అలా పిలిచి, ఏడిపించేది

అనుష్క, ప్రభాస్... మరోసారి నటిస్తే చూడాలని ఉందనేది అభిమానుల కోరిక. ఇక అనుష్క..ప్రబాస్ టీజ్ చేసే విధానం గమ్మత్తుగా ఉంటుందిట.

Anushka, Prabhas, baahubali


వెండితెరపై ప్రభాస్-అనుష్క.. హిట్ అండ్ క్యూట్ జోడీ అనే విషయం ప్రతీ ఒక్కరికీ తెలిసిందే.  'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' రెండు పార్ట్స్‌లో వీళ్లిద్దరూ కలిసి నటించారు. వీళ్ల బాండింగ్ చూసిన ఫ్యాన్స్.. వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారని అంటారు. అయితే తమ మధ్య స్నేహం తప్ప మరొకటి లేదని  వీళ్లు రొటీన్ గా చెప్తూ వచ్చారు. మరీ గట్టిగా పట్టుబడితే  నవ్వుతూ తప్పించుకున్నారు.  వీళ్లిద్దరూ 10 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నారని  అంటారు.
 

Anushka, Prabhas, baahubali


ఈ జంట ప్రేమలో ఉన్నారా లేదా అనే  నిజా నిజాలు ఏమిటనేది ప్రక్కన పెడితే అనుష్క మాత్రం ప్రభాస్ ని ఓ రేంజిలో షూటింగ్ లలో ఆడుకుంటుందిట.  ప్రభాస్ తనను అనుష్క టీజ్ చేయటాన్ని ఎంజాయ్ చేస్తారట. ఆ విషయాలు అబిమానులు తలుచుకుని మరీ ఎంజాయ్ చేస్తూంటారు. అలాగే అదే విషయాన్ని ప్రభాస్, అనుష్క ఇద్దరూ ఓ సారి మీడియా దగ్గర చెప్పుకొచ్చారు కూడా . ఆ వీడియో ప్రభాస్ ప్యాన్స్ వైరల్ చేస్తున్నారు.  


Anushka, Prabhas, baahubali


అనుష్క, ప్రభాస్  కాంబినేషన్ లో తెరకెక్కిన బిల్లా (Billa), మిర్చి (Mirchi) , బాహుబలి1 (Baahubali) , బాహుబలి2 (Baahubali2) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ధన,ఘన విజయం సాధించాయి. ప్రభాస్ ప్రస్తుతం స్పీడుగా సినిమాల్లో నటిస్తుండగా అనుష్క మాత్రం నిదానంగా సినిమాల్లో నటిస్తున్నారు.

ప్రభాస్ అనుష్క జోడీని తెరపై చూడాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ప్రస్తుతం అనుష్క ఒక మలయాళ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తోంది. గతేడాది మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (Miss Shetty Mr Polishetty) సినిమాతో అనుష్క హిట్ అందుకున్నారు. వీళ్లిద్దరూ మరోసారి నటిస్తే చూడాలని ఉందనేది అభిమానుల కోరిక. ఇక అనుష్క..ప్రబాస్ టీజ్ చేసే విధానం గమ్మత్తుగా ఉంటుందిట.


బాహుబలి సినిమా షూటింగ్ జరిగే సమయంలో అనుష్క ప్రభాస్ ను బాగా ఏడిపించేది. విపరీతమైన టీజ్ చేసేది. ఆ సినిమాల్లో ఇద్దరూ తల్లీ కొడుకులుగా నటించిన సంగతి తెలిసిందే.ప్రభాస్ కనపడకపోతే నా కొడుకు ఎక్కడ? నా బాబు ఎక్కడ? అని అడిగేది. ఇలా అడుగుతుండటం,

టీజ్ చేస్తుండటంతో ప్రభాస్ తల పట్టుకున్నాడు. ఇలా సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ ను ఏడిపించిన విషయాన్ని అనుష్క ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో వైరలవుతోంది. బాహుబలి2లో మహేంద్ర బాహుబలిగా అనుష్కకు కొడుకుగా ప్రభాస్ కనిపించారు. 


డార్లింగ్ హీరో ప్రభాస్ వరసపెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానీ క్రేజ్ సంపాదించాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజా పుట్టినరోజుతో 44 ఏళ్లొచ్చినా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నాడు. పెళ్లి మాత్రం చేసుకోవట్లేదు. ఇది మాత్రమే అభిమానుల్ని టెన్షన్ పెడుతున్న విషయం. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి గురించి ప్రముఖ ఇంగ్లీష్ వెబ్‌సైట్ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాసింది. పెళ్లికి అడ్డొస్తున్న సమస్య ఇదేనంటూ బయటపెట్టింది.
 

Latest Videos

click me!