విజయ్‌ దేవరకొండ, రష్మీక మందన్నా డిన్నర్‌కి వెళ్తూ ఫోటోకి దొరికిపోయారా?..ఏంటీ కథ?

First Published | Mar 26, 2021, 7:56 AM IST

`గీతగోవిందం`, `డియర్‌ కామ్రేడ్‌` స్టార్స్ విజయ్ దేవరకొండ, రష్మీక మందన్నాల మధ్య అనుబంధం ఇంకా కొనసాగుతుందా? వీరిద్దరు ఇప్పటికీ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారా? తాజాగా రష్మీకని విజయ్‌ డిన్నర్ కి తీసుకెళ్లాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. తాజాగా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

విజయ్‌ దేవరకొండ, రష్మీక మందన్నా కాంబినేషన్‌కి యమ క్రేజ్‌ ఉంది. వీరిద్దరు కలిసి నటించిన `గీతగోవిందం` బ్లాక్‌ బస్టర్‌ కావడం, ఆ వెంటనే `డియర్‌ కామ్రేడ్‌`లో కలిసి నటించడం, వీరిద్దరు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ కావడం, ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్‌ కావడంతో ఇద్దరి మధ్య ఏదో జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది.
మరోవైపు విజయ్‌ ఇంటికి కూడా రష్మీక వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందని, ఇద్దరూ డేట్‌ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత గ్యాప్‌ వచ్చింది. తాజాగా వీరిద్దరు కలిసి ముంబయిలో ఫోటోలకు చిక్కడంతో మరోసారి రూమర్స్ ఊపందుకున్నాయి.

ఎయిర్‌పోర్ట్ నుంచి వీరిద్దరు కలిసే వెళ్లారు. అయితే ఇందులో విజయ్‌, రష్మీక చాలా క్లోజ్డ్ గా మూవ్‌ అవుతున్నాయి. తాజాగా ఆయా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీంతో వీరి మధ్య తెలియని రిలేషన్‌ కొనసాగుతుందనే వార్తలకు ఊతం పోసినట్టైంది.
అయితే ముంబయిలో ఓ స్టార్‌ హోటల్‌కి రష్మీకని డిన్నర్‌కి తీసుకెళ్లాడట విజయ్‌ దేవరకొండ. అందులో భాగంగానే ఇలా ఫోటోలకు దొరికిపోయారని అంటున్నారు. అయితే ఇందులో వాస్తవమెంతా అనేది తెలియాలి.
నిజంగానే వీరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందా? లేక జస్ట్ మంచి ఫ్రెండ్స్ గానే ఇలా మూవ్‌ అవుతున్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది. కానీ చాలా గ్యాప్‌తో వీరి కలయిక సరికొత్త పుకార్లకి ఊతం పోసినట్టుందని చెప్పొచ్చు.
ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో సినిమా రూపొందుతుంది. అనన్యపాండే హీరోయిన్‌. కరణ్‌జోహార్‌, ఛార్మి తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది ముంబయిలో చిత్రీకరణ జరుపుకుంటోంది.
రష్మీకా మందన్నా ఇటీవల బాలీవుడ్‌ ఆఫర్స్ ని సొంతం చేసుకుంది. సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `మిస్టర్‌ మజ్ను` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు అమితాబ్‌తో కలిసి మరో సినిమా చేయబోతుందని టాక్‌. ఈ సినిమాల షూటింగ్‌లు ముంబయిలో జరుగుతుండటంతో విజయ్‌, రష్మిక కలుసుకుంటున్నారని టాక్‌.
`సుల్తాన్‌` ట్రైలర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. ఇందులో గోదుమ కలర్‌ పలుచని శారీలో హోయలు పోయింది రష్మీక.
ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటో షూట్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
`సుల్తాన్‌` ఈవెంట్‌లో కనువిందు చేసిన రష్మిక.
`సుల్తాన్‌` ఈవెంట్‌లో కనువిందు చేసిన రష్మిక.
`సుల్తాన్‌` ఈవెంట్‌లో కనువిందు చేసిన రష్మిక.
`సుల్తాన్‌` ఈవెంట్‌లో కనువిందు చేసిన రష్మిక.
`సుల్తాన్‌` ఈవెంట్‌లో కనువిందు చేసిన రష్మిక.
మరోవైపు రష్మీకా మందన్నా తెలుగులో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు `ఆడాళ్లు మీకు జోహార్లు` సినిమా చేస్తుంది. అలాగే తమిళంలో కార్తితో కలిసి `సుల్తాన్‌` చిత్రంలో నటిస్తుంది.

Latest Videos

click me!