ప్రభాస్ కి పెళ్లి ఎప్పుడు అవుతుంది అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. నలబై ఏళ్ళు దాటిపోయినా ప్రభాస్ ఆ ఊసు ఎత్తడం లేదు. ప్రభాస్ కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు గట్టి ప్రయత్నాలు చేశారని సమాచారం. కానీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రభాస్ కి పెళ్లి కాలేదు.
పెళ్లిపై ప్రభాస్ కి ఆసక్తి లేదు అనే వాదన ఉంది. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రభాస్ సాకులు చెబుతూ నెట్టుకొస్తున్నాడని కొందరు అంటారు. అన్ స్టాపబుల్ షోలో బాలయ్య ఇదే విషయం లేవనెత్తాడు. ప్రభాస్ తెలివిగా సమాధానాలు చెప్పి తప్పుకున్నాడు. అసలు కారణం మాత్రం బయటపెట్టలేదు.
మరోవైపు ప్రభాస్ పై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. హీరోయిన్ అనుష్కను ప్రేమిస్తున్నాడని, త్వరలో పెళ్లి అంటూ కథనాలు వెలువడ్డాయి. ఏళ్ల తరబడి ఈ పుకారు షికారు చేసింది. పలు సందర్భాల్లో తమ పెళ్లి వార్తలను అనుష్క, ప్రభాస్ ఖండించారు.
అయితే ప్రభాస్ కి పెళ్లి కాకపోవడానికి కారణం ఏమిటో వేణు స్వామి తాజాగా వెల్లడించాడు. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ప్రభాస్ ఫ్యాన్స్ నేను ఏం మాట్లాడినా తిడుతూ ట్రోల్ చేస్తుంటారు. కానీ నేను చెప్పేది మాత్రం నిజం.
Prabhas
ప్రభాస్ గురించి నాకు అన్ని విషయాలు తెలుసు. ఆయన ఎలా సినిమాల్లోకి వచ్చాడో కూడా తెలుసు. ప్రభాస్ జాతకంలో దోషం ఉంది. అందుకే పెళ్లి కావడం లేదు. దోష నివారణ జరిగితే కానీ ప్రభాస్ కి పెళ్లి జరగదు... అని చెప్పుకొచ్చాడు. వేణు స్వామి లేటెస్ట్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.