Guppedantha Manasu: సాక్షికి చమటలు పట్టించిన వసుధార.. రిషీ సార్ జోలికి వస్తే నీ గతి చూసుకో!

Published : Jun 20, 2022, 08:44 AM IST

Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 20వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

PREV
17
Guppedantha Manasu: సాక్షికి చమటలు పట్టించిన వసుధార.. రిషీ సార్ జోలికి వస్తే నీ గతి చూసుకో!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... ఒప్పుకో రిషీ లేదంటే నేను మాములుగా అల్లరి చెయ్యను అంటుంది. అంత అల్లరి అయిన నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాలి అంటే రిషి సీరియస్ గా ఉంటాడు. అప్పుడే ఒప్పుకో రిషీ నువ్వు లవ్ లో ఫెయిల్ అయ్యావ్ ఇక లైఫ్ లో కూడా ఫెయిల్ అవ్వకు అంటూ షాక్ ఇస్తుంది. అప్పుడు రిషి సీరియస్ అయిన కూడా పట్టించుకోకుండా అలాగే బెదిరిస్తోంది. 
 

27

బెదిరించినట్టే ఫైర్ అలారం నొక్కుతున్న అంటూ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి ఫైర్ అలారం నొక్కేస్తుంది. ఇక అది విన్న మహేంద్ర, జగతి కాలేజ్ స్టాఫ్ అంత కూడా అక్కడకు పరిగెత్తు కుంటూ వస్తారు.. ఇప్పటికైనా ఒప్పుకో అంటూ బెదిరిస్తోంది.. అప్పుడే పైన నుంచి ఊడి పడినట్టు వసుధార ఎంట్రీ ఇస్తుంది. చాచా ఛీఛీ అంటూ ఎంట్రీ ఇస్తుంది. 
 

37

చాచా కథ మొత్తం అడ్డం తిరిగిందంటూ హయ్ సాక్షి అని చెప్తుంది. నువ్వెంటి సాక్షి ఇక్కడ ఉన్నావ్ పుస్తకాలు చదవడానికి వచ్చావా అంటుంది.. ఈ పుస్తకంలో విలన్ ప్లాన్ ఏ ప్లాన్ బి అంటూ ప్లన్స్ వేస్తుంది.. కానీ ప్లాన్ సి ఉంటుంది అని విలన్ కు తెలియదు నీకు తెలియనట్టు అంటూ షాక్ ఇస్తుంది. నువ్వు ఎప్పటికి రిషీ సార్ ను చేరుకోలేవు అని ఎప్పుడో చెప్పను అంటూ షాక్ ఇస్తుంది.
 

47

ఏంటి సాక్షి మాట్లాడట్లేదు.. మౌన వ్రతం చేస్తున్నావా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. నువ్వు అలారం మోగించావు కదా ఇప్పటికే అందరూ వస్తుంటారు.. తలుపులు కొడుతారు ఏమో అని షాక్ అనగానే నిజంగానే తలుపులు కొడుతారు. ఏ చేత్తో అయితే లాక్ చేసావో అదే చేత్తో లాక్ తియ్యు.. నువ్వు తిస్తె నిన్ను క్షమిస్తా... నేను తీస్తే ఇక్కడ జరిగిన విషయం మొత్తం అందరికి చెప్పేస్తా అంటుంది. 
 

57

ఆ మాటలు విన్న సాక్షి నోరుమూసుకుని డోర్ ఓపెన్ చేస్తుంది.. లోపలి వచ్చిన వాళ్ళు ఏం జరిగింది అని అడిగితే సాక్షిని భయపెట్టి వసుధార విషయం అంత చెప్పకుండానే అందరిని అక్కడ నుంచి పంపిస్తుంది. నువ్వు చేసింది చెప్పచ్చు కానీ రిషి సార్ పై ఒక్క మాట పడటం కూడా ఇష్టం లేదంటూ సాక్షికి గట్టి షాక్ ఇస్తుంది.. నోరు మెదపకుండా భయపడుతూ అక్కడ నుంచి సాక్షి వెళ్ళిపోతుంది. 
 

67

ఇంత జరిగిన ఒక్క థాంక్స్ కూడా చెప్పకుండా మిస్టర్ ఇగో రిషి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.. ఆతర్వాత సీన్ లో వసుధార సాక్షి గురించి ఆలోచిస్తుంది. ఆతర్వాత నేను తప్పు చేశాను ప్రపోజ్ చేసినప్పుడు ఆ మాటలు అనకుండా ఉండాల్సింది అనుకుంటుంది. మరోవైపు సాక్షి, వసుధార గురించి ఆలోచిస్తుంటాడు. ఇక వసుధార ఆటో ముందు సాక్షి కారు అడ్డు పెట్టి ఆపుతుంది. 
 

77

అక్కడ మళ్లీ సాక్షి గొడవ స్టార్ట్ చేస్తుంది. ఏం అనుకుంటున్నావు నా గురించి అంటే నీ గురించి ఏం ఆలోచిస్తా టైమ్ వెస్ట్ అంటుంది. ఎవరిని చూసి ఈ దైర్యం అని అంటుంది.. నన్ను నేను చూసుకొని దైర్యం అని అంటుంది. నువ్వు ఏం చేసిన రిషి సార్ ను చేరుకోలేవు.. నీకు రిషి సార్ దక్కడు అని అంటుంది. దీంతో అక్కడ ఎపిసోడ్ పూర్తవుతుంది.. మరి రేపటి ఎపిపోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి. 
 

click me!

Recommended Stories