ఉపాసనకి సీమంతం జరిగిందా ?.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫొటోస్

Published : Feb 19, 2023, 03:53 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 

PREV
16
ఉపాసనకి సీమంతం జరిగిందా ?.. వైరల్ అవుతున్న బ్యూటిఫుల్ ఫొటోస్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటై పదేళ్లు పూర్తయింది. వీరిద్దరూ ఎంత అన్యోన్యంగా జీవిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  రాంచరణ్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది.  

26

రాంచరణ్, ఉపాసన పిల్లల్ని కనడం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరగడం చూస్తూనే ఉన్నాం. ఇక అభిమానులైతే మెగా వారసుడి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించేలా  కొన్ని వారాల క్రితం రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నట్లు మెగా ఫ్యామిలీ ప్రకటించింది. దీనితో మెగా అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. 

36

రాంచరణ్, ఉపాసన తల్లి దండ్రులు అయ్యే క్షణం కోసం కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసన గర్భవతి. నెలలు దగ్గర పడిన తర్వాత సీమంతం చేయడం సంప్రదాయం. అయితే ఉపాసన సీమంతం ముందుగానే జరిగిపోయిందా అని అనుమానం కలిగేలా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

46

ఉపాసన మెడలో పూలమాల ధరించి ఉంది. ఆమెతో ఆమె స్నేహితులు, కుటుంబ సభ్యులు, భర్త రాంచరణ్ కూడా ఉన్నారు. అయితే అది సీమంతం కాదని అంటున్నారు. ఉపాసన, చరణ్ తల్లిదండ్రులు కాబోతుండడంతో.. ఉపాసన స్నేహితురాలు స్మిత రెడ్డి విష్ చేసి గిఫ్ట్స్ ఇచ్చారు. 

56

ఈ సందర్భంగా చిన్న ఫంక్షన్ లాగా చేశారట. అంతే తప్ప అది సీమంతం కాదని అంటున్నారు. ఈ ఫోటోలలో రాంచరణ్ తల్లి సురేఖ కూడా కనిపిస్తున్నారు. ఇటీవల సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన సోషల్ మీడియాలో విష్ చేసింది. 

66

ఉపాసన, రాంచరణ్ తరచుగా వెకేషన్స్ కి వెళ్లడం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం ఉపాసన గర్భవతి కాబట్టి ఆమె విశ్రాంతి తీసుకుంటోంది. ఆధ్యాత్మిక గురువు సద్గురు లాంటి వారి వద్దకు వెళుతూ భక్తి మార్గంలో కూడా పయనిస్తోంది. 

click me!

Recommended Stories