ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ తులసి ఇద్దరూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు తులసి అప్పట్లో పెళ్లి ఫోటోలకు ఎలా ఫోజులు ఇచ్చేదో చెబుతూ ఉండడంతో సామ్రాట్ నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడు చిన్నప్పుడు జరిగిన విషయాల గురించి చెప్పుకుని నవ్వుతూ ఉంటుంది తులసి. మరొకవైపు అంకిత జరిగిన విషయాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటుంది. లాస్య, నందు అన్న మాటలు తలచుకొని ఏడుస్తూ బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి పరంధామయ్య అనసూయ వస్తారు.