లేడీ సూపర్‌స్టార్‌ వివాదంపై స్పందించిన మల్లు బ్యూటీ.. నయనతార ఫ్యాన్స్ కి వివరణ.. ఏం చెప్పిందంటే

Published : Feb 13, 2023, 03:14 PM ISTUpdated : Feb 13, 2023, 05:05 PM IST

బోల్డ్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తుంది మాళవిక మోహనన్‌. ఇటీవల నయనతారపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె దీనిపై స్పందించి, వివరణ ఇచ్చింది.   

PREV
15
లేడీ సూపర్‌స్టార్‌ వివాదంపై స్పందించిన మల్లు బ్యూటీ.. నయనతార ఫ్యాన్స్ కి వివరణ.. ఏం చెప్పిందంటే

మల్లు భామ మాళవిక మోహనన్‌ గ్లామర్‌ ఫోటోలతో పాపులర్‌ అయ్యింది. ఆమె సినిమాల కంటే హాట్‌ ఫోటో షూట్లతోనే ఎక్కువగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. బోల్డ్ గా ఫోటోలను పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఇంటర్నెట్‌లో యమ క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఈ బ్యూటీకి మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. 

25

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా మాళవిక మోహనన్‌ పేరు వార్తల్లో నిలుస్తుంది. అందుకు కారణం నయనతారపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే. లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గురించి మీ అభిప్రాయం చెప్పాలని ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌ ప్రశ్నించగా, `లేడీ సూపర్‌ స్టార్‌ అనడం తనకు నచ్చదని, హీరోయిన్లని సూపర్‌ స్టార్‌ అంటే చాటు, లేడీ సూపర్‌స్టార్‌ అనడం ఏంటంటూ ప్రశ్నించింది. 
 

35

దీనికి నయనతార ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. నయనతార స్టార్‌డమ్‌ చూసి ఓర్వలేకపోతున్నారంటూ, అందుకే ఆమె పేరుని వాడుకుని తాను పాపులర్‌ అవ్వాలనుకుంటుందంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు.  దీంతో ఎట్టకేలకు దీనిపై మాళవిక మోహనన్‌ దిగొచ్చింది. తన కామెంట్లకి వివరణ ఇచ్చింది. ట్రోల్స్ కి ఫుల్‌స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేసింది. 

45

దీనిపై మాళవిక మోహనన్‌ తాజాగా స్పందిస్తూ ట్వీట్‌ చేసింది. హీరోయిన్ల విషయంలో తన అభిప్రాయం చెప్పాను తప్ప, ఓ హీరోయిన్‌ని టార్గెట్‌ చేస్తూ నేనలా అనలేదు. నిజానికి నయనతార అంటే నాకిష్టం. ఆమెని ఎంతో గౌరవిస్తాను. సీనియర్‌గా ఆమె కెరీర్‌ని చూసి ఇన్‌స్పైర్‌ అవుతాను. దయజేసి అందరూ కాస్త శాంతించండి, ముఖ్యంగా మీడియా వారు అంటూ పేర్కొంది మల్లు భామ. మరి ఈ ట్వీట్‌తో ట్రోల్ కి ఫుల్‌ స్టాప్‌ పడుతుందా అనేది చూడాలి. 
 

55

ఇదిలా ఉంటే మాళవిక ప్రస్తుతం మలయాళంలో `క్రిస్టీ` చిత్రంలో నటిస్తుంది. అలాగే విక్రమ్‌తో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందట. ప్రభాస్‌తో మారుతి సినిమాలో హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నయనతార పాన్‌ ఇండియామూవీస్‌, లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో బిజీగా ఉంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories