మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాక్ లో.. నేడు నిర్వహించిన 77వ స్వాతంత్ర్య దినోత్సవానికి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌లో జెండాను ఎగురవేశారు. ఆయన వెంట DR.మాధవి కూడా ఉణ్నారు. జెండా వందనం చేసి స్వాతంత్ర్య ఫలాన్ని అందించిన మహానీయులను గుర్తుచేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్నారు. భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. త్రివర్ణ పతానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎప్పుడూ దేశ సంసృతులు, సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ ఉంటారు. ఈరోజు 77వ స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు స్నేహరెడ్డి, ఆయాన్, అర్హ తో కలిసి ఫొటోకూ ఇలా ఫోజిచ్చారు. ఇంట్లోనే కుటుంబంతో కలిసి జెండా వందనం చేశారు.
77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయంలో మోహన్ బాబు, తనయుడు, ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు జెండా వందనం చేశారు.అనంతరం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. ‘77వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఎందరో మహానుభావులు దేశం కోసం తమ ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసి మనకు స్వాతంత్య్రం అందించారు. ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే వారి త్యాగాలే కారణం’ అని అన్నారు.
ఈ పండుగను పురస్కరించుకొని తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాను. ఎందుకంటే నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాళెం. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామప్రజలు మూలకారణం. పల్లెటూరు నుండి డిల్లీ పార్లమెంటు వరకు నాప్రస్తానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తమ సొంతం గ్రామం మోదుగులపాళెం నుండి 100 మంది గ్రామస్తులను కూడా ఆహ్వానించారు. అలాగే తన తల్లిదండ్రులు మంచు నారాయణస్వామి నాయుడు, లక్ష్మమ్మ లనూ గుర్తు చేసుకున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో జెండాను ఆవిష్కరించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్ గా నందమూరి బాలకృష్ణ యేటా జెండా పండుగను ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆయనచేతుల మీదుగా జెండా ఆవిష్కరించి మహానీయులను గుర్తు చేసుకున్నారు.
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) కూడా ఇండిపెండెన్స్ వేడుకల్లో పాల్గొంది. ఈ సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని తన గుండెకు హత్తుకొని దేశభక్తిని చాటుకుంది.
ఇండిపెండెన్స్ డే సందర్భంగా రాఖీ ఖన్నా ఈ ఫొటోలను పంచుకుంది. మరో ఫొటోలో త్రివర్ణం గల బెలూన్స్ ను గాల్లోకి ఎగరేస్తూ స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంది.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే జెండా పండుగను సెలబ్రేట్ చేసుకుంది. తన ఇంట్లోని బాల్కానీ నుంచి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తూ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. దేశభక్తి చాటుకుంది.
ఢిల్లీ బ్యూటీ, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్వాతంత్య్ర వేడుకలను సెలబ్రేట్ చేసుకుంది. తన నివాసంలోనే జాతీయ జెండాను ఎగురవేసి, సెల్యూట్ చేసింది. తాజాగా ఓ ఫొటోను షేర్ చేస్తూ తన అభిమానులకూఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలిపింది.
‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైశ్వాల్ 77వ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ను పాల్గొంది. ట్రెడిషనల్ వేర్ లో ఈ ముద్దుగుమ్మ త్రివర్ణ పతాకాన్ని గాల్లోకి ఎగురవేస్తూ దేశభక్తిని చాటుకుంది. కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.
కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ కూడా జెండా పండుగను తన నివాసంలో సెలబ్రేట్ చేసుకుంది. తానుంటున్న ఫ్లాట్ లోనే మూడురంగుల జెండాను గాల్లో ఎగరవేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. తనలోని దేశభక్తిని చాటుకుంది. ఈ సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది.