రష్మిక మందన్నా రెండేళ్ల క్రితం `ఛలో` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకోవడంతోపాటు, తన క్యూట్ అందాలతో, నటనతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది. తనలో ఏదో మ్యాజిక్ ఉందని చూపించింది.
ఈ బ్యూటీకి విజయ్ దేవరకొండతో `గీతగోవిందం` చిత్రంలో నటించింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. వంద కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో డే అండ్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఆ తర్వాత ఈ అమ్మడు నటించిన `దేవ్‌దాస్` యావరేజ్ సక్సెస్‌ని చూసింది. `డియర్ కామ్రేడ్` పరాజయం చెందింది. కానీ దాన్ని ఈ ఏడాది వచ్చిన మహేష్‌బాబు `సరిలేరు నీకెవ్వరు`, నితిన్ `భీష్మ` ఫుల్‌ఫిల్ చేశాయి. రెండూ బ్యాక్ టూ బ్యాక్ విజయాలను అందుకున్నాయి.
తాజాగా తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో డీ గ్లామర్ పాత్రలో రష్మిక నటించబోతుందట.
దీంతోపాటు `ఆడాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రమిది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు.
ఈ క్రమంలో రష్మిక ఫోకస్ బాలీవుడ్‌వైపు మళ్లిందని తెలుస్తుంది. నిజానికి రష్మిక గతేడాది నుంచే బాలీవుడ్ సినిమాలపై మోజు పడిందట. అక్కడి అవకాశాల కోసం ప్రయత్నించిందని వార్తలు వినిపించాయి.
ఆ వార్తలను ఇటీవల నిజం చేసింది. హిందీలో ఎంట్రీని ఖరారు చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందుతున్న `మిషన్ మంజు` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని రష్మిక అధికారికంగా వెల్డడించింది.
ఇంతటితో ఆగడం లేదు.. మరో బాలీవుడ్ చిత్రం రష్మికని వరించిందట. అది మామూలు సినిమా కాదు, బంపర్ ఆఫర్ తెలుస్తుంది. బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌తో నటించే అరుదైన అవకాశం ఈ అమ్మడికి దక్కిందట.
వికాస్ భల్ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో `డెడ్లీ` అనే సినిమా రూపొందుతుంది. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఆద్యంతం ఎమోషనల్‌గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఇందులో బిగ్‌బీకి కూతురు పాత్రలో రష్మికని తీసుకునే ఆలోచనలో ఉన్నారు. దీనిపై ఇప్పటికే రష్మికతో చర్చలు జరిగినట్టు, ఆమె కూడా ఓకే చెప్పిందనే వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
చూడబోతే రష్మిక ఫోకస్ మొత్తం బాలీవుడ్‌పైనే ఉందని అర్థమవుతుంది. 2016లో `కిర్రాక్ పార్టీ` చిత్రంతో కన్నడలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక తొలి చిత్రంలోనే విజయాన్ని అందుకుంది. రెండేళ్లలో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ అయిపోయింది. మరో రెండేళ్లలో హిందీ ఆఫర్‌ని చేజిక్కించుకుంది.
ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టిపెట్టింది. తన మెయిన్ టార్గెట్ హిందీ అని తెలుస్తుంది. అందుకోసం కన్నడ, తెలుగుని వాడుకుందా? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి హిందీ తర్వాత ఆ రేంజ్ పాపులారిటీ, క్రేజ్ ఉన్న పరిశ్రమ తెలుగు. ఇంకా చెప్పాలంటే హిందీని మించి పోతుంది. ఈ క్రమంలో రష్మిక బాలీవుడ్‌పై మోజుపడటం పలు అనుమానాలకు తావిస్తుంది.
ప్రస్తుతం రష్మిక తెలుగులో కొత్త సినిమాలేవి ప్రకటించలేదు. కమిట్ అయిన సినిమాలోనే నటిస్తున్నారు. పలు ప్రాజెక్ట్ ల్లో ఆమె పేరు వినిపించినా ఇంకా క్లారిటీ రాలేదు. కానీ హిందీలో వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ దూసుకుపోతుండటం విశేషం. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతోపాటు కన్నడలో `పొగరు`, తమిళంలో `సుల్తాన్` చిత్రంలో నటిస్తుంది రష్మిక.