‘డీజే టిల్లు‘తో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి తెలుగు హీరోయిన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆడియెన్స్ లో రాధికగా గుర్తుండిపోయేలా చేసింది. తన నటనతో ఆకట్టుకుంది. నెక్ట్స్ విశ్వక్ సేన్ సరసన ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’తో అలరించనుంది.
ఇక డీజే టిల్లు ఇచ్చిన సక్సెస్ తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస ఆఫర్లు అందుతున్నారు. చివరిగా ‘బెదురులంక 2012’ చిత్రంతో అలరించింది. ఈ సినిమా కూడా హిట్ అయ్యింది.
నెక్ట్స్ మరిన్ని చిత్రాలతో రాబోతోంది. ఈ క్రమంలో నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఈ క్రమంలో తన గురించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అందిస్తూ వస్తోంది.
ఇక తాజాగా ఓ ఛానెల్ కు నేహా శెట్టి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్బంగా తను హీరోయిన్ గా మారడానికి ప్రేరేపించిన అంశాలను చెప్పుకొచ్చింది. తనకు చిన్నప్పటి నుంచే హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉందని చెప్పింది.
దీంతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya rai Bachchan), దీపికా పదుకొణె (Deepika Padukone) ను ఇన్ స్పైర్ గా తీసుకుందని చెప్పింది. వారిలాగే తొలుత మోడల్ గా మారి.. టైటిల్స్ కోసం ప్రయత్నించినట్టు తెలిపింది.
చిన్నప్పటి నుంచి హీరోయిన్ లాగే ప్రతి క్షణం ఫీలైనట్టు చెప్పింది. అందుకే తను ఒక సారి వేసుకున్న డ్రెస్ ను మరోసారి వేసుకోలేదంట. ఈ విషయంలో తల్లిదండ్రుల దగ్గర మొండిగానే ఉన్నట్టు చెప్పింది. ఏదేమైనా ప్రస్తుతం హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.