'ది గోట్' ట్విట్టర్ రివ్యూ.. దళపతి విజయ్ యాక్షన్ డ్రామా హిట్టా ఫట్టా ? పెద్ద మైనస్ అదే

First Published | Sep 5, 2024, 6:40 AM IST

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మానాడు లాంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. స్నేహ, మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు. 

ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మానాడు లాంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. స్నేహ, మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ, ప్రభుదేవా కీలక పాత్రల్లో నటించారు. విజయ్ ని డ్యూయెల్ రోల్ లో చూపిస్తూ వెంకట్ ప్రభు భారీ బడ్జెట్ లో యాక్షన్ డ్రామా తెరకెక్కించారు. 

వైవిధ్యమైన యాక్షన్ చిత్రాలకు వెంకట్ ప్రభు పెట్టింది పేరు. గోట్ ట్రైలర్ మొత్తం సాలిడ్ యాక్షన్ బ్లాక్స్ తో నింపేశారు. విజయ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. గురువారం రోజు ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ప్రీమియర్ షోలు ప్రారంభం అయ్యాయి. గోట్ చిత్రానికి ప్రేక్షకులు ట్విట్టర్ లో ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 8 - ఏసియానెట్ పోల్ 


గోట్ చిత్రం 3 గంటల లెన్తీ రన్ టైంతో ప్రారంభం అవుతుంది. కెన్యాలో 2008లో కథని ప్రారంభిస్తారు. సినిమా ప్రారంభమైన 15 నిమిషాల తర్వాత హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశంతో దళపతి విజయ్ ఎంట్రీ ఇస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం విజయ్ మార్క్ స్టైల్, కామెడీ టైమింగ్ ఆకట్టుకుంటుంది. అదే విధంగా యాక్షన్ సన్నివేశాల కొరియోగ్రఫీ చాలా బావుంది. కాకపోతే యాక్షన్ సీన్లు కాస్త లెన్తీ అనిపిస్తాయి అని ప్రేక్షకులు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నారు. 

కొన్ని సన్నివేశాలు వాస్తవానికి దూరంగా ఉండడం కూడా కాస్త డ్రా బ్యాక్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో డైరెక్టర్ వెంకట్ ప్రభు సాలిడ్ స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్ గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్ ట్విస్ట్ బావుంది. మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఇంకాస్త బ్యాగ్రౌండ్ స్కోర్ పై వర్క్ చేయాల్సింది. బిజియం బావుండి ఉంటే ఫస్ట్ హాఫ్ మరో లెవల్ లో ఉండేది. కానీ ఇప్పటికీ ఫస్ట్ హాఫ్ బావుంది అంటే అందుకు కారణం విజయ్ స్క్రీన్ ప్రెజెన్స్, వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే అని చెప్పొచ్చు. 

సెకండ్ హాఫ్ కి అద్భుతమైన స్టేజి సెట్ చేశారు. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. అయితే చివరి 40 నిమిషాల్లో సినిమా తిరిగి పుంజుకుంటుంది. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి చాలా బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ ని వెంకట్ ప్రభు అద్భుతంగా తెరకెక్కించారు. చివరి 40 నిమిషాల్లో ట్విస్ట్ లు రివీల్ అయ్యే విధానం బావుంటుంది. 

విజయ్ ఎంట్రీ, ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ బాగా వర్కౌట్ అయ్యేలా వెంకట్ ప్రభు ప్లాన్ చేసుకున్నారు. తండ్రీకొడుకులు విజయ్ నటన ఆకట్టుకుంటుంది. కొన్ని చోట్ల ఈ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ లాంటి హాలీవుడ్ చిత్రాలని తలపిస్తుందని ట్విట్టర్ లో ప్రేక్షకులు అంటున్నారు. 

ఫస్ట్ హాఫ్ ఎక్కడా లాగ్ లేకుండా థ్రిల్లింగ్ ఉంటుంది. అదే మొమెంటం సెకండ్ హాఫ్ లో కంటిన్యూ కాలేదు. కానీ విజయ్ పెర్ఫామెన్స్, క్లైమాక్స్ సెకండ్ హాఫ్ ని సేవ్ చేశాయి అని అంటున్నారు. ఓవరాల్ గా వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామాని.. థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు అని అంటున్నారు. 

Latest Videos

click me!