భారీ ధర పలికిన విజయ్ 67 మూవీ డిజిటల్ హక్కులు.. ఎన్ని కోట్లు..? ఎవరు దక్కించుకున్నారంటే..?

First Published | Jan 18, 2023, 7:02 PM IST

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు తమిళ స్టార్ హీరో విజయ్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఓ కన్నేశాడు. ఈక్రమంలో ప్రస్తుతం 67వ సినిమా చేస్తున్నాడు దళపతి. ఈమూవీ డిజిటల్ రైట్స్ మంచి ధర పలికినట్టు తెలుస్తోంది.

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి పక్కా ప్లాన్ తో కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నాడు. తమిళనాట స్టార్ హీరోగా ఉన్న విజయ్.. ఇటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాధించాడు. ఈక్రమంలో ఇక్కడ మార్కెట్ ను కూడా పెంచుకునే పనిలో ఉన్నాడు విజయ్. ఈ నేపథ్యంలోనే వారసుడు సినిమాను రెండు భాషల్లో తెరకెక్కించాడు. 
 

Vijay

విజయ్ ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీగా ఆయన 66వ సినిమా రూపొందింది. తమిళంలో వరిసు.. తెలుగులో వారసుడు టైటిల్ తో తెరకెక్కిన ఈమూవీ ఈ నెల 11వ తేదీన విడుదలైంది. తమిళనాట హిట్ టాక్ తో దూసకుపోతోంది. తెలుగులో మాత్రం వారసుడు' మూవీ  ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. 


ఇక ప్రస్తుతం విజయ్ తన 67వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈమూవీపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. విజయ్ కు మాస్టర్ మూవీత్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తమిళ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో  ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈమూవీ సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. చెన్నైల్ ఈమూవీ షూటింగ్ జరుగుతోంది. 
 

ఇక ఈసినిమా ద్వారా చాలా కాలం తరువాత హీరోయిన్ గా త్రిష రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మస్తున్న ఈమూవీకి సబంధించిన హక్కులు భారీ ధర పలికినట్టు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులే.. దాదాపుగా 160కోట్లు పలికినట్టు సమాచారం. ఈ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుందట. 
 

Vijay

వారసుడు మూవీ కాస్త నిరూత్సాహపరచడంతో.. నెక్ట్స్ సినిమా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు విజయ్. ఈ విషయంలో లోకేష్ కు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది. ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ ఏడాదే సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  

Latest Videos

click me!