మాల్దీవ్స్ లో రీతూ వర్మ బర్త్ డే సెలబ్రేషన్స్.. పొట్టి నిక్కరులో తెలుగు బ్యూటీ రచ్చ.. స్టన్నింగ్ పిక్స్

First Published | Mar 11, 2023, 4:39 PM IST

తెలుగు హీరోయిన్ రీతూ వర్మ (Ritu Varma) ప్రస్తుతం వేకేషన్ లో ఉంది. తన పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.  ఈ సందర్భంగా కొన్ని  పిక్స్ ను అభిమానులతో పంచుకుంది.
 

యంగ్ హీరోయిన్  రీతూ వర్మ తెలుగు హీరోయిన్ అన్న విషయం తెలిసిందే.  1990 మార్చి 10న హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది.  ఇక్కడే చదువు కూడా  పూర్తి చేసింది.  రీతూ వర్మ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేలోనే బీటెక్ పూర్తి చేయడం విశేషం. ఆ తర్వాత మోడల్ గా కేరీర్ ప్రారంభించింది.
 

కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లోనూ నటించి యూత్ మంచి క్రేజ్ దక్కించుకుంది. తన టాలెంట్ చూపించిన రీతూ వర్మ తొలుత ‘బాద్ షా’లో అవకాశం అందుకుంది. సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకుంది.  ఆ తర్వాత నేరుగా హీరోయిగా ఆఫర్ కొట్టేసింది. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’,‘పెళ్లి  చూపులు’ వరకు టాలీవుడ్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది.
 


ప్రస్తుతం రీతూ వర్మ క్రేజ్ కు ఢోకా లేదు. వరుస చిత్రాలతో అలరిస్తూనే వస్తోంది. ఇటు  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్  గా కనిపిస్తూనే ఉంది. అయితే ఇటీవల ఇన్ స్టాలో పెద్దగా కనిపించని ఈ బ్యూటీ.. తాజాగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. తన వేకేషన్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది.

రీతూ వర్మ 32వ పుట్టిన రోజు సందర్భంగా  మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకున్నట్టు తెలిపింది. సన్నిహితుల మధ్య బర్త్ డే వేడుకలు ముగిశాయి. ఇక తాజాగా బీచ్ లో తిరుగుతూ ఫొటోలకు ఫోజుల్చింది. స్కై బ్లూ షర్ట్, మినీ డెనిమ్ జీన్స్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. 
 

తెలుగు బ్యూటీలో బీచ్ లో స్టన్నింగ్ పోజులివ్వడంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల గ్లామర్ ఒళకబోస్తుండటంతో రీతూ వర్మను నెటిజన్లు మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె పంచుకునే పిక్స్ ను క్షణాల్లో లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు.  
 

రీతూ వర్మ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు నెటటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  తెలుగు బ్యూటీకి మరిన్ని అవకాశాలను రావాలని ఆకాంక్షిస్తున్నారు.  గతేడాది ‘ఓకే ఒక జీవితం’తో అలరించి రీతూ వర్మ. ప్రస్తుతం తమిళ చిత్రం ‘ధ్రువ నక్షత్రం’లో నటిస్తోంది. 
 

Latest Videos

click me!