తమన్నా వద్దకి ఓటీటీ మూవీ.. మిల్కీ బ్యూటీ ఇక వాటికే పరిమితమా?

First Published | Jan 25, 2024, 5:34 PM IST

మిల్కీ బ్యూటీ తమన్నా గతేడాది బోల్డ్ కంటెంట్‌ ఓటీటీ సిరీస్‌లో దుమ్ములేపింది. సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమెకి అలాంటి మూవీస్‌ వస్తుండటం గమనార్హం. 
 

మిల్కీ బ్యూటీ తమన్నా చేతిలో ప్రస్తుతం పెద్ద సినిమాలు లేవు. గతేడాదిలోనే మూడు పెద్ద సినిమాల్లో నటించారు. రెండో ఓటీటీ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ చేసింది. కానీ మొత్తం తన ఇమేజ్‌ని మార్చేసుకుంది ఈ అందాల భామ. సినిమాలు సక్సెస్‌ కాలేదు. కానీ ఓటీటీ లో చేసిన వెబ్‌ సిరీస్‌, ఆంథాలజీ ఫిల్మ్ మాత్రం దుమ్మురేపాయి. దీంతో తమన్నాకి ఇప్పుడు ఆ ఇమేజ్‌ ఎక్కువగా ఉంది. ఓటీటీలో ఫాలోయింగ్‌ పెంచుకుంది. ఈ బ్యూటీకి అలాంటి కథలే వస్తున్నాయి. 

తాజాగా మరో ఓటీటీ మూవీ ఆఫర్‌ వచ్చింది. గతేడాది తక్కువ బడ్జెట్‌తో చిన్న కాస్టింగ్‌తో వచ్చిన `ఓడేలు రైల్వేస్టేషన్‌` సీక్వెల్‌ ఆఫర్‌ తమన్నా వద్దకు వచ్చింది. ఇప్పుడు ఆమె చేస్తుందా? లేదా అనేది ఆసక్తికరంగా మారింది. సంపత్‌ నంది కథ అందించిన `ఓడేలు రైల్వే స్టేషన్‌` మూవీ 2022లో వచ్చి మంచి ఆదరణ పొందింది. ఈ మూవీకి అశోక్‌ తేజ దర్శకత్వం వహించారు. ఇందులో హేబా పటేల్‌, పూజిత పొన్నాడ, వశిష్ట ఎన్‌ సింహా, సాయి రోనక్‌ నటించారు. 
 


డీ గ్లామర్‌ నేపథ్యంలో రస్టిక్‌ కథాంశంతో క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. `ఆహా`లో విడుదలై మంచి ఆదరణ పొందింది. ఈ ఓటీటీ ఫిల్మ్ తో హేబా పటేల్‌కి మంచి పేరొచ్చింది. ఆమెకి ఓటీటీ ఆఫర్లు క్యూ కట్టాయి. ఇప్పుడు బిజీగా ఉంది. అయితే క్రిటికల్‌గా ఈ ఓటీటీ ఫిల్మ్ కి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో సీక్వెల్‌ని తీసుకురాబోతున్నారు దర్శకుడు సంపత్‌ నంది. కథ కూడా రెడీ చేశాడు. తొలి చిత్రానికి దర్శకత్వం వహించి అశోక్‌ తేజ్‌ ఈ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. 
 

ఈ సీక్వెల్‌లో మెయిన్‌ లీడ్‌ కోసం తమన్నాని అడిగారట సంపత్‌ నంది. తాను రూపొందించిన `రచ్చ`, `బెంగాల్‌ టైగర్‌`, `సీటీ మార్‌` చిత్రాల్లో తమన్నా హీరోయిన్‌గా చేసింది. ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. దీంతో ఆమెని సంప్రదించారట. తమన్నాకి కథ నచ్చిందని తెలుస్తుంది. కాకపోతే ఆమె కొంత టైమ్‌ అడిగినట్టు తెలుస్తుంది. నటించాలా? వద్దా అనే దైలమాలో ఉందట. 

మరోవైపు డేట్స్ విషయంలోనూ క్లారిటీ వచ్చాక తాను చేసేది లేనిది చెబుతా అన్నట్టు సమాచారం. ఈ మూవీని కెకె రాధా మోహన్‌ నిర్మించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే తమన్నా వద్దకి ఇప్పుడు ఓటీటీ మూవీస్‌ వస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌లు వస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ ఇక ఓటీటీలకే పరిమితమా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఒకప్పుడు హీరోయిన్‌గా ఇండస్ట్రీలను ఊపేసింది. కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

tamannaah

 గతేడాది ఆమె నటించిన `జీ కర్దా`, `లస్ట్ స్టోరీస్‌2` బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సంచలనంగా మారాయి. దీంతో తమన్నాపై చాలా ట్రోల్స్ జరిగాయి. తమన్నా ఇలాంటి పాత్రలు చేయడమేంటనే కామెంట్లు వచ్చాయి. ఇప్పుడు అలాంటి మూవీస్‌ రావడం గమనార్హం. అయితే `ఓడేల రైల్వేస్టేషన్‌` ఓటీటీలో కాకుండా థియేటర్లోకి తీసుకొచ్చేలా పెద్ద రేంజ్‌లో చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. 

 తమన్నా ప్రస్తుతం విజయ్‌ వర్మతో ప్రేమలో ఉంది. గత కొంత కాలంగా ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో ఉన్నారు. బహిరంగంగానే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఈ ఏడాది పెళ్లికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరి వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందా? లేదా అనేది చూడాలి. 

Latest Videos

click me!