రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో తమన్నా భాటియా.. ఒకే కారులో డిన్నర్ నైట్ కు బయల్దేరిన మిల్క్ బ్యూటీ.. వైరల్

First Published | Apr 25, 2023, 2:22 PM IST

మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా (Tamannaaah Bhatia) మరోసారి తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. 
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా సీక్రెట్ గా డేటింగ్ లో ఉందంటూ కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. నాని నటించిన ‘ఎంసీఏ’లో విలన్ గా మెప్పించిన విజయ్ వర్మ (Vijay Varma)తోనే ప్రేమలో ఉందంటూ పుకార్లు వచ్చాయి. అయితే మిల్క్ బ్యూటీని వాటిని నిజం చేస్తూనే ఉంది. 
 

గతంలో తమన్నా భాటియా  (Tamannaah Bhatia) పెళ్లి గురించి వార్తలు వచ్చిన, ప్రశ్నలు ఎదురైనా వాటిని కొట్టిపారేస్తూ వచ్చింది. దీంతో మిల్క్ బ్యూటీ ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతుందా? అని  అందరూ ఆసక్తిగా చూశారు. పెళ్లి  వార్తనే ఎత్తనివ్వని ఈ బ్యూటీ ప్రస్తుతం డేటింగ్ లో మునిగితేలుతోంది.
 


2023 న్యూ ఈయర్ సెలబ్రేషన్స్ ను గోవాలో చేసుకున్న తమన్నా తన భాయ్ ఫ్రెండ్ అజయ్ వర్మనే అని తేల్చి చెప్పించింది. సెలబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకు ముద్దులు పెట్టిన ఫొటోలు, వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. దీంతో మిల్క్ బ్యూటీ డేటింగ్ రహస్యం బయటపడింది.

ఈ రూమర్లపై తమన్నా, విజయ్ వర్మ  ఎప్పుడు స్పందించలేదు. కనీసం ఖండించకపోవడం లేదు. దీంతో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు పదే పదే తమన్నా - విజయ్ జం టగా కనిపిస్తూ రూమర్లను నిజం చేస్తున్నారు. 

తాజాగా తమన్నా - విజయ్ వర్మ ముంబైలో ఓకే కారులో కనిపించారు. డిన్నర్ డేట్ కు బయల్దేరి వీరు కెమెరా కంటికి చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్లు వస్తున్నా క్రమంలో మళ్లీ మళ్లీ జంటగా కనిపించి ఆకట్టుకుంటున్నారు. 
 

కేరీర్ విషయానికొస్తే తమన్నా ప్రస్తుతం హిందీలో నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి ‘బోలే చుడియాన్‌’లో నటిస్తోంది. తెలుగులో ‘భోళా శంకర్’,  తమిళంలో రజినీకాంత్ సరసన ‘జైలర్’లో నటిస్తూ బిజీగా ఉంది. ఇక విజయ్ వర్మ డార్లింగ్స్, గల్లీ బాయ్, పింక్, ఘోస్ట్ స్టోరీస్, సూపర్ 30 మరియు బాఘీ 3 వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్‌’, ‘దహద్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. 
 

Latest Videos

click me!