తమన్నా భాటియా రాయల్ లుక్.. మిల్క్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ కు మతులు పోవాల్సిందే..

First Published | Apr 2, 2023, 11:10 AM IST

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం నార్త్ లో చాలా సందడి చేస్తోంది. ఈ సందర్బంగా ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఈమేరకు తాజాగా స్టైలిష్ వేర్ లో మిల్క్ బ్యూటీ స్టన్నింగ్ గా ఫొటోషూట్ చేసింది. 
 

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. ఈ క్రమంలో బ్యూటీఫుల్ ఫొటోషూట్ తో దర్శనమిచ్చింది.  

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ఇటు సౌత్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూనే అటు నార్త్ లోనూ తెగ సందడి చేస్తోంది.  సినిమాలతో బిజీ అయిపోవడమే గాక.. పలు పెద్ద ఈవెంట్లకు హాజరవుతూ ఆకట్టుకుంటోంది.  తనదైన లుక్స్ లో మెరుస్తూ ఫ్యాన్స్ తో పాటు ఈవెంట్ కు హాజరైన వారిని ఆకర్షిస్తున్నారు.  
 


మార్చి 31న అహ్మాదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ప్రారంభమైన ఐపీఎల్ 2023 ఓపెనింగ్ వేడుకల్లో రష్మిక మందన్నతో కలిసి తమన్నా స్టెప్పులేసిన  విషయం తెలిసిందే.  తమన్నా డాన్స్ పెర్ఫామెన్స్ కు స్టేడియం మొత్తం  ఫిదా అయిపోయింది. ఇక తాజాగా   మిల్క్ బ్యూటీ  మరో ఈవెంట్ కు హాజరైంది.  
 

ముంబైలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఈవెంట్ లో నిన్న సందడి చేశారు. పలువురు సెలబ్రెటీలతో కలిసి  హాజరైన తమన్నా తన ఫ్యాషన్ లుక్ తో ఆకట్టుకుంది. సిల్వర్ స్టైలిష్ బాడీకాన్  డ్రెస్ లో అదరగొట్టింది. రాయల్ డిజైన్ గల అవుట్ ఫిట్ లో కట్టిపడేసింది. 
 

ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫొటోషూట్ కూడా చేసింది. ఆ ఫొటోలను తాజాగా తన అభిమానులతో పంచుకుంది. రాకుమారిలా దర్శనమిచ్చిన మిల్క్ బ్యూటీ స్టన్నింగ్ స్టిల్స్ తో మతులు పోగొట్టింది. తమన్నా పోజులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. 
 

ఇటీవల తమన్నా ఏ ఈవెంట్ కు హాజరైన తన లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఫ్యాషన్స్ సెన్స్ తో మంత్రముగ్ధులను చేస్తున్నారు. తాజాగా ఇలా  దర్శనమిచ్చిన తమన్నా.. ఈవెంట్ లో ఫొటోలకు ఫోజులివ్వడంతో పాటు స్పెషల్ గా ఫొటోషూట్ కూడా చేశారు. 

ఇలా ఎప్పటికప్పుడు కొత్త లుక్స్ లో ఆకట్టుకుంటున్న తమన్నాను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తుతున్నారు. తన నయా లుక్ కు ఖుషీ  అవుతూ ఫొటోలను నెట్టింట లైక్స్, కామెంట్లతో తెగ వైరల్ చేస్తున్నారు. మరోవైపు తన గ్లామర్ మెరుపులకు, మత్తు పోజులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

తమన్నా కేరీర్ విషయానికొస్తే.. ఈ స్టార్ బ్యూటీ ఫుల్ జోష్ లో ఉంది. గతేడాది ఎఫ్3, బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలంలో నటించి అలరించింది. ప్రస్తుతం ‘భోళా శంకర్’,‘జైలర్’,‘బంద్ర’ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. 

Latest Videos

click me!