
తమన్నా దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన నటి. మిల్కీ బ్యూటీ అంటే అందానికి మారుపేరు. ఆమె నడుము అందాలు మరింత ఫేమస్. తమన్నా నడుముని చూపించేందుకు మేకర్స్ పోటీపడేవాళ్లు. అంతేకాదు స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిందీ భామ. కుర్ర హీరోల నుంచి చిరంజీవి వంటి సీనియర్ల వరకు జోడీ కట్టింది. ఇప్పుడు `భోళాశంకర్`లో నటిస్తున్న ఈ మిల్కీ భామ.. ఇప్పుడు ఒక్కసారిగా తెలుగులో ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు లేవు. తాను ఒప్పుకోవడం లేదా? లేక తనకు ఆఫర్లు రావడం లేదా? కారణం ఏదైనా ఈ బ్యూటీ చేతిలో కొత్తగా ఒక్క సినిమా కూడా లేదు. అయితే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందని టాక్. తమిళంలో `జైలర్`, మలయాళంలో `బాంద్రా` చిత్రంలో నటిస్తుంది తమన్నా. మరోవైపు ప్రస్తుతం ఆమె నటుడు విజయ్ వర్మతో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. తెలుగులో ఖాళీ అయిపోయింది. జనరల్‌గా సాయిపల్లవి బలమైన పాత్ర, బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలే చేస్తుంది. గ్లామర్ రోల్స్ చేయదు, వాటికి పూర్తిగా దూరం. పైగా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటుంది. చివరగా ఆమె `లవ్ స్టోరీ`, `విరాటపర్వం` వంటి చిత్రాల్లో నటించింది. మెప్పించింది. `లవ్ స్టోరీ` బాగానేఆడింది. కానీ `విరాటపర్వం` మాత్రం బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది. విమర్శకులనుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత సాయిపల్లవి తెలుగులో మరే సినిమాకి సైన్ చేయలేదు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో ఖాళీ. తమిళంలో శివ కార్తికేయన్‌తో కమల్ హాసన్ ప్రొడక్షన్ ఓ సినిమా చేస్తుందీ నేచురల్ బ్యూటీ.
రాశీఖన్నా.. మోడల్‌గా రాణించిన ఈ బ్యూటీ.. `ఊహలు గుసగుసలాడే` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకుంది. తొలి సినిమా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ బ్యూటీ కూడా విజయవంతమైన సినిమాలు చేసింది. కానీ ఇటీవల కాలంలో సక్సెస్ లేదు. దీంతో నెమ్మదిగా ఛాన్స్ లు తగ్గాయి. అయితే ఆ మధ్య `ఫర్జీ` అనే వెబ్ సిరీస్ చేసింది. అన్ని లాంగ్వేజ్‌లో విడుదలైంది. నటిగానూ మెప్పించింది. దీంతో `ది ఫ్యామిలీ మ్యాన్ 2` వెబ్ సిరీస్ తర్వాత సమంత లాగా పాపులర్ అవుతుందని భావించారు. కానీ రాశీఖన్నాకి అది ఏమాత్రం ఉపయోగపడలేదు. తెలుగులో మాత్రం అసలు ఆఫర్లే లేవు. ఇప్పుడు ఈ బ్యూటీకి ఒక్క సినిమా కూడా లేదు. ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయిందీ అందాల భామ. హిందీలో ఓసినిమాలో నటించింది.
బేబమ్మ కృతి శెట్టి లైఫ్ ఏడాదిలోనూ లైఫ్ టర్న్ అయ్యింది. అదే ఏడాది ఆమె లైఫ్ రివర్స్ అయ్యింది. `ఉప్పెన` సినిమాతో ఉవ్వెత్తున ఎగిసింది. ఓవర్ నైట్‌లో స్టార్ అయిపోయింది. వరుసగా ఆరేడు సినిమాలు చేసింది. `శ్యామ్ సింగరాయ్`, `బంగార్రాజు`, `ది వారియర్స్`, `మాచర్ల నియోజకవర్గం`, `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, `కస్టడీ` చిత్రాలు చేసింది. అన్నీ ఫ్లాప్ అయ్యాయి. దీంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. కృతిది ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిలో ఉండిపోయింది. అయితే ఆమె కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుందట. పైగా తమిళం, కన్నడలోనూ సినిమాలు చేస్తున్నట్టు సమాచారం. ఏమైనా టాలీవుడ్‌లో ఈబ్యూటీకి అధికారికంగా ఒక్క సినిమా కూడా లేదు.
పూజా హెగ్డే పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. ఆమె నటించాల్సిన `గుంటురు కారం`, `ఉస్తాద్ భగత్ సింగ్` ఆఫర్లు పోయినట్టు సమాచారం. ఇదే నిజమైతే పూజా కూడా ఖాళీ అయిపోయినట్టే అయితే. సాయిధరమ్ తేజ్‌తో సంపత్ నంది సినిమాలో ఎంపికైందనే రూమర్ ఉంది. మరోవైపు ఒకటిరెండు తెలుగు సినిమాలకు చర్చలు జరుగుతున్నట్టు టాక్.
ప్రగ్యా జైశ్వాల్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఆమె `అఖండ` చిత్రంతో పూర్వ వైభవం పొందుతుందని భావించారు. కానీ ఆమెకి ఒక్క ఆఫర్ కూడా లేదు. దీంతో ఫేడౌట్ అయిపోయింది. ప్రస్తుతం సినిమాలు లేక వెకేషన్‌లో టైమ్ పాస్ చేస్తుందీ ఈ అందాల భామ.
`ఇస్మార్ట్ శంకర్` చిత్రంతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది నభా నటేష్. అంతకు ముందు రెండు మూడు సినిమాలు చేసినా అవి వర్కౌట్ కాలేదు. `ఇస్మార్ట్ శంకర్`లో గ్లామర్ డోస్ పెంచింది. హాట్‌గా కనిపించింది. పెద్ద హిట్‌ని అందుకుంది. కానీ ఆ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ అనుకున్నట్టుగా సాగలేదు. `డిస్కోరాజా`, `సోలో బ్రతుకే సో బెటర్`, `అల్లుడు అదుర్స్`, `మ్యాస్ట్రో` చిత్రాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీని పట్టించుకోవడం లేదు. అయితే యాక్సిడెంట్ కారణంగా గ్యాప్ వచ్చిందని, ప్రస్తుతం రెండు మూడు సినిమాలున్నట్టు చెప్పింది. కానీ ఇప్పటి వరకు అప్‌డేట్ లేదు. ఈ లెక్కన ప్రస్తుతానికి నభా తెలుగులో ఖాళీనే. ఇంకోవైపు `ఇస్మార్ట్ శంకర్`తోనే పాపులర్ అయిన నిధి అగర్వాల్ పరిస్థితి సేమ్. ఆమె పవన్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. ఇది చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉంది. ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఆ తర్వాత నిధికి ఒక్క సినిమా కూడా లేదు. ఆల్మోస్ట్ ఈ అమ్మడు కూడా ఖాళీ అనే చెప్పాలి.