షాకింగ్.. దళపతి విజయ్ ఆఫీస్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. చేతిలో, నోట్లో పరోటా..

Published : Jun 19, 2022, 12:09 PM IST

ఇళయదళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాట అభిమానులకు విజయ్ ఆరాధ్య దైవం. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ మాత్రమే.

PREV
16
షాకింగ్.. దళపతి విజయ్ ఆఫీస్ లో వ్యక్తి అనుమానాస్పద మృతి.. చేతిలో, నోట్లో పరోటా..

ఇళయదళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాట అభిమానులకు విజయ్ ఆరాధ్య దైవం. సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్ మాత్రమే. సౌత్ లో విజయ్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఒకరు. 

26

ఇదిలా ఉండగా విజయ్ కి చెందిన ఆఫీస్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయ్ కి చెన్నై ఔటస్కర్ట్స్ పనైయుర్ లో ఓ ఆఫీస్ ఉంది. ఈ ఆఫీస్ నుంచి విజయ్ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అలాగే రాజకీయ కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయని అంటారు. దీనికి 'విజయ్ మక్కల్ ఇయక్కం' అని పేరు పెట్టారు. 

36

ఈ ఆఫీస్ లో ప్రభాకరన్ అనే వ్యక్తి కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ బంగ్లా రేనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల ప్రభాకరన్ తన ఫ్యామిలీని కలిసేందుకు సొంత ఊరు వెళ్లి వచ్చాడు. గురువారం రాత్రి ప్రభాకరన్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. 

46

ఆఫీస్ సూపర్ వైజర్ ని పరోటా కొనుక్కునేందుకు రూ 100 అడిగాడట. ఆ తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు. శుక్రవారం ఉదయం చూసే సరికి ప్రభాకరన్ మృత దేహంగా మారి కనిపించాడు. 

56

 అతడి నోట్లో, చేతిలో పరోటా అలాగే ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. దీనితో ప్రభాకరన్ సడన్ గానే మరణించి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని తరలించారు. 

66

అయితే ప్రభాకరన్ ఎందుకు మరణించాడు ? హత్యా ? ఆత్మహత్యా ? అనేది ఎవరూ ఊహించలేకున్నారు. ఈ సంఘటనపై ఆఫీస్ సిబ్బంది విజయ్ కి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

click me!

Recommended Stories