వర్కౌట్ మొదలెట్టిన మహేశ్ బాబు.. మరోసారి అట్రాక్టివ్ లుక్ లో అదరగొట్టిన సూపర్ స్టార్..

Published : Aug 16, 2022, 01:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) తన అప్ కమింగ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టారు. ఇటీవల తన వెకేషన్ ను పూర్తి చేసుకున్న ఆయన ఇక షూటింగ్ కు సిద్ధం అవుతున్నారు. ఈ మేరకు తాజాగా వర్క్ అవుట్ స్టార్ట్ చేశారు.   

PREV
16
వర్కౌట్ మొదలెట్టిన మహేశ్ బాబు.. మరోసారి అట్రాక్టివ్ లుక్ లో  అదరగొట్టిన సూపర్ స్టార్..

స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ - మహేశ్ బాబు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్  ‘ఎస్ఎస్ఎంబీ28’ (SSMB28). అభిమానులు సహా ప్రేక్షకులు ఈ మూవీ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం  అవుతుందని ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ సెట్స్ పైకి వెళ్లినట్టు  తెలుస్తోంది. 
 

26

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు (Mahesh Babu) - స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రూపుదిద్దుకోనున్న చిత్రం SSMB28. ఇటీవల ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకులను అలరించిన మహేశ్ బాబు ఇక తన తదుపరి చిత్రాలైన ‘ఎస్ఎస్ఎంబీ 28’, ‘ఎస్ఎస్ఎంబీ 29’పై ఫోకస్ పెట్టారు.  

36

ఈ సందర్భంగా మహేశ్ బాబు తాజాగా తన బాడీ ట్రాన్స్ ఫార్మేషన్ కోసం జిమ్ వర్క్ అవుట్స్ ను ప్రారంభించారు. ప్రముఖ సెలబ్రెటీ ఫిట్ నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ గైడ్ లైన్స్ లో శిక్షణ మొదలెట్టారు. ఈయన హీరోల బాడీలను పాత్రలకు, షూటింగ్ కు అనుకూలంగా ట్రైన్ చేస్తారు.  కఠినమైన శిక్షణతో అట్రాక్టివ్ ఫిట్ నెస్ ను తెప్పిస్తారు. 
 

46

టాలీవుడ్ లో ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రెండుసార్లు లాయిడ్ స్టీవెన్స్ శిక్షణ ఇచ్చారు. త్రివిక్రమ్ తో చేసిన ‘అరవింద సమేత వీర రాఘవ’లో సిక్స్ ప్యాక్ కోసం, అలాగే రాజమౌళి దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో భీం పాత్రకు కావాల్సిన విధంగా బాడీని తీర్చిదిద్దేందుకు లాయిడ్ వద్ద ఎన్టీఆర్ కఠిన శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు దర్శకులతో పనిచేయనున్న మహేశ్ బాబు కూడా లాయిడ్ వద్ద ఫిట్ నెస్ ట్రైయిన్ కు  సిద్ధమయ్యారు. 

56

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే త్రివిక్రమ్ - మహేశ్ బాబు  చిత్రం ప్రారంభమైందని తెలుస్తోంది. ఈ సినిమా కోసమే మహేశ్ అదిరిపోయే లుక్ కూడా ఫైనల్ అయ్యింది. ఇటీవల ఆ పిక్ ను పంచుకోగా.. తాజాగా లాయిడ్ తో కలిసి మరో స్టైలిష్ పిక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

66

మహేశ్ బాబు  చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ ని త్రివిక్రమ్ ఎలా చూపించబోతున్నాడని ఆడియెన్స్ లో ఆత్రుత మొదలయ్యింది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నారు. 

click me!

Recommended Stories