సౌత్ లో బిజీ అయిపోతున్న సన్నీ లియోన్.. పింక్ డ్రెస్ లో బోల్డ్ బ్యూటీ గ్లామర్ మెరుపులు!

First Published | Feb 5, 2023, 2:26 PM IST

బాలీవుడ్ నటిగా ప్రేక్షకులను అలరిస్తున్న సన్నీ లియోన్ (Sunny Leone) ప్రస్తుతం సౌత్ సినిమాల్లోనూ ఫుల్ బిజీ అయిపోతున్నారు. వరుస సినిమాల్లో లీడ్ రోల్స్ లోనూ అవకాశాలు అందుకుంటూ వస్తోంది. 
 

పోర్న్ స్టార్‌గా స్టార్ట్ అయిన సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ నటిగా ప్రేక్షకులను అలరిస్తున్న బోల్డ్ బ్యూటీ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. తొలుత హిందీ చిత్రాల్లో బోల్డ్ కంటెంట్ తో అలరించింది. మరోవైపు స్పెషల్ అపియరెన్స్ తోనూ ఆకట్టుకుంటుంది. 
 

సన్నీలియోన్ డాన్స్, గ్లామర్ మెరుపులకూ ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మరోవైపు ఈ బ్యూటీ నటించిన ‘జిస్మ్ 2, జాక్ పాట్, రాగిణి ఎంఎంఎస్ 2’త పాటు తదితర చిల్రాల్లో నటించింది. స్పెషల్ అపియరెన్స్ తో నార్త్ లో తన సత్తా చూపించింది. 


ప్రస్తుతం ఈ  భామా కన్ను సౌత్ సినిమాలపైనా పడింది. దీంతో వరసగా ఆఫర్లను అందుకుంటూ వస్తోంది. ‘కరెంట్ తీగ’ చిత్రంతో కామియో అయరెన్స్ ఇచ్చి తెలుగు ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. మరోవైపు ఇక్కడా ఐటెమ్ సాంగ్స్ మరియు లీడ్ రోల్స్ లో అవకాశాలను అందుకుంటోంది.
 

‘గరుడ వేగ’లో ఐటెం సాంగ్, ‘జిన్నా’లో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇలా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది నుంచి ఇప్పటి వరకు ఏకంగా సౌత్ లో ఆరేడు సినిమాలను కలిగి ఉండి బిజీ షెడ్యూల్ ను ఫాలో అవుతోంది. 
 

గతేడాది ఏకంగా మూడు సినిమాలు సౌత్ లో రిలీజ్ అయ్యాయి. తెలుగులో ‘జిన్నా’, కన్నడలో ‘ఛాంపియన్’, తమిళంలో ‘హో మై ఘోస్ట్’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ఏకంగా తమిళంలోనే ‘వీరమాదేవి’,‘షేరో’ రెండు సినిమాల్లో నటిస్తోంది. అలాగే మలయాళంలో ‘రంగీలా’ చిత్రంలో మెరియనుంది. 
 

ఈ ఏడాది రాబోతున్న తమిళం, మలయాళ చిత్రాలతో సన్నీలియోన్ నటిగా ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది. లీడ్ రోల్ లో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవైపు హిందీలో యథావిథిగా స్పెషల్ అపియరెన్స్ తో అలరిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. లేటెస్ట్ పోస్టులతో మైమరిపిస్తోంది. తాజాగా వన్ షోల్డర్ పింక్ అవుట్ ఫిట్ లో గ్లామర్ విందు చేసింది. స్టన్నింగ్ పోజులతో అదరగొట్టింది. ఆ పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.  
 

Latest Videos

click me!