సీక్రేట్ గా ఆ పని మొదలు పెట్టిన శేఖర్ మాస్టర్, త్వరలో కొత్త అవతారంలో స్టార్ కొరియోగ్రఫర్

First Published | Feb 12, 2023, 8:58 PM IST

సరికొత్త అవతారం ఎత్తబోతున్నాడు స్టార్ కొరియోగ్రఫర్. ఇన్నాళ్లు స్టార్ హీరోల చేత అదిరిపోయే స్టెప్పులేపించిన శేఖర్ మాస్టర్.. ఇప్పుడు అదే హీరోలతో యాక్షన్.. కట్ చెప్పబోతున్నారట. 

ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది కొరయోగ్రఫర్లు డాన్స్ మాస్టార్లుగా అవతారం ఎత్తగా.. త్వరలో గా మరో డాన్స్ మాస్టర్  డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్నాడు. ఆయన మరెవరో కాదు.. శేఖర్ మాస్టర్.  డాన్స్ షోలో మెంటర్ గా కెరీర్ స్టార్ట్ చేసి.. స్టార్ కొరియో గ్రాఫర్ గా ఎదిగాడు శేఖర్ మాస్టర్.  

టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ స్టార్ హీరోలతో సిగ్నేచర్ స్టెప్పులేయించాడు శేఖర్ మాస్టార్. అంతే కాదు.. ఇప్పటికీ పలు  టీవీ షోలకు, డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించారు శేఖర్ మాస్టర్. టాలీవుడ్ ఏదైనా పెద్ద సినిమా తెరకెక్కుతోందంటే.. కొరియోగ్రాఫర్ గా శేఖర్ మాస్టర్ ఉండాల్సిందే. 


స్టార్ హీరోలు సైతం శేఖర్ మాస్టర్ తో కలిసి వర్క్ చేయాలనుకుంటారు. అటువంటిది ప్రస్తుతం డాన్స్ మాస్టర్ గా తనకున్న అనుభవంతో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అయ్యాడట శేఖర్ మాస్టర్. ఇన్నేళ్ళ అనుభవంతో  ఓ కథను కూడా రెడీ చేసుకున్నారట.  డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వడం కోసం రెడీ అవుతున్నారు శేఖర్ మాస్టర్.

అంతే కాదు షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఇప్పటికే షూటింగ్ కూడా  మొదలుపెట్టారని.. సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన తరువాత.. అది బాగుంటేనే  మీడియా ముందుకు రావాలని భావిస్తున్నారట. మొత్తానికి సైలెంట్ గా సినిమాను పూర్తి చేసి.. దర్శకుడిగా ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడు శేఖర్ మాస్టర్. 
 

సౌత్ సినిమా ఇండస్ట్రీలో  టాప్ కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారడం కొత్తేమి కాదు. ఇప్పటికే  చాలా మంది దర్శకులుగా మారి స్టార్ డైరెక్టర్లు అయ్యారు.  కొందరు హీరోలుగా కూడా రాణిస్తున్నారు. ప్రభుదేవా, రాఘవ లారెన్స్, లాంటి వారు కొరియోగ్రాఫర్లుగా మంచి గుర్తింపుని, సంపాదించుకున్నరు. 

రీసెంట్ గా బృంద మాస్టర్  డైరెక్టర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హే సినామిక అనే సినిమాను తెరకెక్కించింది. ఈ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈమె కోనసీమ థగ్స్ అనే యాక్షన్ సినిమాను రూపొందిస్తోంది. ఇలా చాలా మంది కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్స్ అవతారం ఎత్తుతుండగా.. శేఖర్ మాస్టర్ కూడా దర్శకుడిగా మారబోతున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!