చి. ప్రదీప్‌కి చి.ల.సౌ శ్రీముఖి రాయునది ఏమనగా?.. ఎరుపు అందాల ఫోటోస్‌ వైరల్‌

First Published | Oct 24, 2020, 2:09 PM IST

శ్రీముఖి తన అభిమానులకు దసరా గిఫ్ట్ ఇచ్చింది. కొత్త కొత్త కబుర్లతో సరదాని పంచబోతుంది. తాను కొత్తగా ముస్తాబై అలరించిబోతుంది. దసరాకి సర్ప్రైజింగ్‌ గిఫ్ట్ ఇవ్వబోతుంది. 

శ్రీముఖ తెలుగు హాట్‌ యాంకర్‌. బొద్దుగా ఉంటూ క్యూట్‌ లుక్స్ తో, ఘాటు అందాలతో ఆకట్టుకుంటుంది. తన కొత్త ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది.
ఈ దసరాకి పెళ్ళి కూతురిగా ముస్తాబై రాబోతుంది. చిలసౌ శ్రీముఖిగా అభిమానులను కనువిందు చేయబోతుంది.

ఈ విషయాన్ని శ్రీముఖి పంచుకుంది. పెళ్ళి కుమారుడు ప్రదీప్‌ అట. ఈ సందర్భంగా `చి.ప్రదీప్‌కి, చి.ల.సౌ శ్రీముఖి నమస్కరిస్తూ రాయునది` అని పేర్కొంది.
మరి ప్రదీప్‌కి శ్రీముఖి ఏం రాసింది. ఏం రాయాల్సి వచ్చిందనేది రేపు(ఆదివారం) సాయంత్రం ఐదు గంటలకు జీతెలుగులో చూడాలని తెలిపింది. దసరా స్పెషల్‌గా వీరురూపొందించిన కార్యక్రమంప్రసారం కానుందని పేర్కొంది.
ఈ సందర్భంగా శ్రీముఖి తన కొత్త ఫోటోను పంచుకుంటూ నెటిజన్లకి మత్తెక్కిస్తుంది. ఎరుపు, తెలుపు లెహంగా ఓనీ(క్రాప్‌ టాప్‌)లో కనువిందు చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. మత్తెక్కించే చూపులతో, ఎరుపు అందాలతో అలరిస్తుంది శ్రీముఖి.
బ్యాక్‌ టూ బ్యాక్‌ గ్యాప్‌ లేకుండా ఇలా తన గ్లామర్‌ ఫోటోలతో శ్రీముఖి రెచ్చిపోతుంటే ఆమె అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.
దసరా మాకు ముందే వచ్చిందని సంబరపడుతున్నారు. నీ అందం చూడతరమా అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
శ్రీముఖి `బొమ్మఅదిరింది` షోతోపాటు `ఓ ఉమానియా` అనే మహిళా స్పెషల్‌ టాక్‌ షో చేస్తుంది. మరోవైపు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్ లో స్పెషల్‌ ఈవెంట్స్ లోనూహోస్ట్ గా చేస్తూ ఆకట్టుకుంటుంది.
ఇలా ఓ వైపు బుల్లితెరపై, మరోవైపు వెండితెరపై అలరిస్తూ కెరీర్‌ని బ్యాలెన్‌ చేయడంతోపాటు తన ప్రతిభని చాటుకుంటుంది. ఉమెన్‌ ఎంపావర్‌మెంట్‌కి సరైన అర్థాన్నిస్తుంది.

Latest Videos

click me!