ఆర్థిక కష్టాలు, షూటింగ్స్ లేక సూసైడ్ చేసుకొనే స్థితికి చేరిన అవినాష్... ఆ టైంలో శ్రీముఖి చేసిన పనికి

First Published | Jul 30, 2021, 6:13 PM IST

జబర్దస్త్ కామెడీ షో వేదికగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో ముక్కు అవినాష్ ఒకరు. సీనియర్స్ షో నుండి తప్పుకున్నాక అవినాష్ టీమ్ లీడర్ కూడా అయ్యారు. కెవ్వు కార్తీక్-ముక్కు అవినాష్ టీమ్ లీడర్స్ గా మస్తు మజా పంచే వారు. 
 

అయితే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో అవినాష్ జబర్దస్త్ కి బై చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం పది లక్షలు కట్టి, షో నుండి బయటికి వచ్చినట్లు అవినాష్ తెలిపారు. అదే సమయంలో బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ మంచి రెమ్యూనరేషన్ పొందినట్లు వెల్లడించారు.
అయితే ఓ దశలో తాను ఆత్మహత్య చేసుకునే స్థితికి చేరినట్లు ముక్కు అవినాష్ తెలియజేశారు. పేరెంట్స్ కి ఆపరేషన్స్ చేయించి, షూటింగ్స్ లేక ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో సూసైడ్ చేసుకోవాలని భావించినట్లు అవినాష్ తెలిపారు.

ఆర్థికంగా బాగా కష్టాల్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం జబర్దస్త్ షో నుండి బయటికి వెళ్లాలనుకుంటే పది లక్షలు చెల్లించామన్నారు. అప్పడు నా దగ్గర డబ్బులు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని అవినాష్ ఆవేదన చెందాడు.
డబ్బులు ఎవరినీ అడగడం నాకు ఇష్టం ఉండదు. కానీ చాలా అవసరం. ఆ సమయంలో నేను అడగకుండానే శ్రీముఖి ఇంట్లో ఉన్న పదిలక్షలు తీసుకు వచ్చి నాకు ఇచ్చింది. శ్రీముఖి చేసిన సాయం ఎప్పటికీ మరచిపోయేలేను అని అవినాష్ కన్నీరు పెట్టుకున్నారు.
కామెడీ స్టార్స్ షోలో శ్రీముఖి పై స్పూఫ్ స్కిట్ చేసిన అవినాష్, శ్రీముఖి ఎదుటే ఈ విషయాన్ని జడ్జి శేఖర్ మాస్టర్ కి తెలియజేశాడు. శ్రీముఖి చాలా మంచి మనసు కలిగిన అమ్మాయి అని తెలియజేశాడు.
బిగ్ బాస్ షో నుండి బయటికి వచ్చాక అవినాష్ తో పాటు మరికొందరు టీమ్స్ తో స్టార్ మా లో కామెడీ స్టార్స్ పేరుతో ఓ షో ప్రారంభమైంది. శేఖర్ మాస్టర్, శ్రీదేవి జడ్జెస్ గా ఉన్న ఈ షోకి, వర్షిణి యాంకర్ గా ఉన్నారు.

Latest Videos

click me!