వైట్‌ డ్రెస్‌లో క్యూట్‌ అందాలతో కట్టిపడేస్తున్న శ్రీలీల.. నవ్వులు చిందిస్తూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్‌

Published : Aug 15, 2023, 06:37 PM IST

టాలీవుడ్‌ యంగ్‌ సెన్సేషన్‌గా మారిపోయింది శ్రీలీల. ఈ బ్యూటీ ప్రస్తుతం అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్‌గా రాణిస్తుంది. అంతేకాదు ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలో స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకుందీ బ్యూటీ.   

PREV
18
వైట్‌ డ్రెస్‌లో క్యూట్‌ అందాలతో కట్టిపడేస్తున్న శ్రీలీల.. నవ్వులు చిందిస్తూ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్‌

శ్రీలీల.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌. ఎవరికీ సాధ్యం కాని విధంగా ఆమె టాప్‌ స్టార్స్ నుంచి, యంగ్ హీరోల వరకు ఒకేసారి ఆఫర్లని అందుకుంది. సాధారణంగా యంగ్‌ హీరోల నుంచి స్టార్స్, సూపర్‌ స్టార్స్ వరకు వెళ్తుంటారు హీరోయిన్లు. కానీ శ్రీలీలకి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ఆమె ఏక కాలంలో సూపర్‌ స్టార్స్ నుంచి, స్టార్స్, యంగ్‌ హీరోలతోనూ సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఎవరికీ సాధ్యం కాని ఫీట్‌ని అఛీవ్‌ చేస్తుంది. 
 

28

ప్రస్తుతం సుమారు పది సినిమాలతో బిజీగా ఉంది శ్రీలీల. ఇంతటి బిజీ లైఫ్‌లోనూ అడపాదడపా తన అందాల విందు చేస్తూనే ఆకట్టుకుంటుంది. గ్లామర్‌ కి గేట్లు ఎత్తని ఈ బ్యూటీ చుడిదార్‌, గౌను వంటి ట్రెడిషనల్‌ దుస్తుల్లోనే మెరుస్తుంది. హోమ్లీ లుక్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుంది. వైట్‌ డ్రెస్‌లో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ క్రేజీ బ్యూటీ. 
 

38

తాజాగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్‌లో పాల్గొంది శ్రీలీల. వైట్‌ అండ్‌ వైట్‌లో మెరిసిపోయింది. వైట్‌ డ్రెస్‌లో ఈ బ్యూటీ అందం మరింత ఓవర్‌ లోడ్‌ అవుతుంది. దీనికితోడు క్యూట్‌ లుక్‌లో మంత్రముగ్దుల్ని చేస్తుంది. చిలిపి నవ్వులు చిందిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. జాతీయ జెండాని చేత పట్టుకుని ఆద్యంతం కట్టిపడేస్తుందీ యంగ్‌ సెన్సేషన్‌. ప్రస్తుతం శ్రీలీల పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో అందరికి ఆమె ఇండిపెండెన్స్ డే విషెస్‌ తెలిపింది. 
 

48

`పెళ్లి సందడి` అనే చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయం అయ్యింది శ్రీలీల. కె రాఘవేంద్రరావు ఈ బ్యూటీని తెలుగు తెరకి పరిచయం చేశారు. ఇందులో డాన్సులతో, నటనతో ఆకట్టుకుంది. దీంతో వెంటనే రవితేజతో కలిసి నటించే అవకాశాన్ని అందుకుంది. `ధమాఖా` చిత్రంలో మాస్‌ రాజాతో స్టెప్పులేసి కేక పెట్టించింది. ఈ బ్యూటీ డాన్సులకు అంతా ఫిదా అయిపోయారు.

58
Sreeleela

అంతే ఈ భామకి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, సూపర్‌ స్టార్‌ మహేష్‌, బాలకృష్ణ నుంచి రామ్‌, విజయ్‌ దేవరకొండ, వైష్ణవ్‌ తేజ్‌, నవీన్‌ పొలిశెట్టి వరకు దాదాపు అన్ని ఏజ్‌ గ్రూప్‌లతో కలిసి నటిస్తుంది. 
 

68

ఇప్పుడు శ్రీలీల వద్ద ఉన్న సినిమాల లిస్ట్ చూస్తే మైండ్‌ బ్లాక్‌ అయిపోతుంది. `భగవంత్‌ కేసరి`లో ఆమె బాలకృష్ణకి కూతురుగా నటిస్తుంది. ఇక `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌`లో పవన్‌కి జోడీగా చేస్తుంది. పూజా హెగ్డే స్థానంలో శ్రీలీల ఆఫర్ దక్కించుకుంది. మరోవైపు `గుంటూరు కారం` చిత్రంలోనూ పూజా స్థానంలో ప్రమోట్‌ అయ్యింది. 

78

వీటితోటు రామ్‌తో `స్కంధ` మూవీలో చేస్తుంది. విజయ్‌ దేవరకొండతో గౌతమ్‌ తిన్ననూరి ఫిల్మ్ లో నటిస్తుంది. నితిన్‌తో `ఎక్ట్ర్సా ఆర్డినరీ మ్యాన్‌`, అలాగే వైష్ణవ్‌ తేజ్‌తో `ఆదికేశవ్‌` నవీన్‌ పొలిశెట్టితో `అనగనగా ఒక రాజు`, అలాగే ఓ కన్నడ మూవీ చేస్తుంది. వీటితోపాటు చిరంజీవి సినిమాలోనూ ఎంపికైంది. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే మూవీలో శర్వానంద్‌కి జోడీగా శ్రీలీల కనిపించబోతుంది. 
 

88

శ్రీలీల వరుసగా ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్లకి చెమటలు పట్టిస్తుంది. వారి ఆఫర్లని కూడా సొంతం చేసుకుంటూ వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. జెలసి పుట్టిస్తుంది. స్టార్‌ హీరోయిన్లని వెనక్కి నెట్టి దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌ అయ్యేందుకు అడుగులు వేస్తుందీ క్యూటీ్‌ బ్యూటీ. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories