మెగా వారసుడు కోసం పదేళ్లుగా ఫ్యాన్స్ నిరీక్షిస్తున్నారు. చిరంజీవి, రామ్ చరణ్ నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు కావాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలకు మించి సినిమా వారసత్వాన్ని ఫ్యాన్స్ కోరుకుంటారు. దశాబ్దాలుగా ఈ ట్రెండు కొనసాగుతుంది. అది తమ పరువుకు సంబంధించిన విషయంగా భావిస్తారు. ఈ క్రమంలో ఏళ్లుగా రామ్ చరణ్, ఉపాసన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
తాము పిల్లలను కనకపోవడానికి కారణం ఉందని ఉపాసన నేరుగా వెల్లడించారు. పెళ్ళైన వెంటనే ఈ మేరకు ఉపాసన దంపతుల మధ్య అగ్రిమెంట్ ఉందట. పదేళ్ల తర్వాతే ఫ్యామిలీ ప్లానింగ్ అని ఒక నిర్ణయానికి వచ్చారట. సమాజం నుండి, కుటుంబ సభ్యుల నుండి ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా అగ్రిమెంట్ బ్రేక్ చేయలేదని ఉపాసన చెప్పుకొచ్చారు. గత ఏడాది డిసెంబర్ 12న చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఉపాసన-రామ్ చరణ్ పేరెంట్స్ కాబోతున్నారంటూ ప్రకటించారు.
చిరంజీవి ప్రకటన అభిమానులను ఎక్కడలేని సంతోషంలో ముంచింది. వారు సంబరాలు జరుపుకున్నారు. కాగా వారు రామ్ చరణ్ కి అబ్బాయి పుట్టాలని బలంగా కోరుకుంటున్నారు. అయితే వారి ఆశలు గల్లంతే అంటున్నారు. ఉపాసనకు పుట్టేది అమ్మాయే అని ఓ చర్చ మొదలైంది. అందుకు ఆధారాలు చూపుతూ కొందరు బల్లగుద్ది చెబుతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇంటర్వ్యూలలో చేసిన కామెంట్స్ మొదటి ఆధారంగా చెబుతున్నారు. పరోక్షంగా వారు తమ మాటల్లో పుట్టబోయేది అమ్మాయే అని హింట్ ఇచ్చినట్లు భావిస్తున్నారు. రామ్ చరణ్ మాట్లుడుతూ... థర్డ్ జూన్ ఆన్ 'హెర్' వే... అన్నారు. జూన్ నెలలో అమ్మాయి రాబోతుందని ఆయన ఫ్లోలో అనేశారు. కాబట్టి ఇదొక ఆధారంగా అనుకోవచ్చు.
ఇటీవల జరిగిన ఉపాసన సీమంత వేడుకలో పింక్ కలర్ హైలెట్ చేశారు. పింక్ థీమ్ లో సీమంత వేడుకను అలంకరించారు. ఉపాసన సైతం మిల్కీ పింక్ కలర్ ట్రెండీ వేర్ ధరించారు. పింక్ కలర్ అమ్మాయికి సూచన అని, పుట్టబోయేది అమ్మాయని తెలిసిన రామ్ చరణ్-ఉపాసన అలా సీమంత వేడుక అలకరించారని అంటున్నారు.
ఇక మూడో హింట్ గా అల్లు అర్జున్ గిఫ్ట్ ని ప్రస్తావిస్తున్నారు. ఉపాసన సీమంత వేడుకకు హాజరైన అల్లు అర్జున్ ఉపాసనతో కలిసి ఫోటో దిగారు. సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సి... అని కామెంట్ పెట్టారు. అలాగే గిఫ్ట్ వ్రాప్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉపాసనకు పుట్టబోయేది ఖచ్చితంగా అమ్మాయే అంటున్నారు
Ram Charan
అయితే ఉపాసన-రామ్ చరణ్ లకు పుట్టబోయేది అమ్మాయే అని ఎలా తెలుసు? లింగనిర్ధారణకు పాల్పడ్డారా, అది నేరం కదా? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యూఎస్ లో లింగనిర్ధారణ మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కాబట్టి రామ్ చరణ్ దంపతులు యూఎస్ లో తమకు పుట్టబోయే బిడ్డ ఎవరనే సమాచారం పొంది ఉండవచ్చని ఒక వాదన. ఏది ఏమైనా ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఉపాసనకు పుట్టేది అమ్మాయా? అబ్బాయా? అనేది తెలియాలంటే మరో మూడు నెలలు వేచి చూడాల్సిందే.
రామ్ చరణ్ సిస్టర్ సుస్మిత ఆ మధ్య ఉపాసనకు అబ్బాయి పుడితే బాగుండు అన్నారు. ఇప్పటికే మా ఫ్యామిలీలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎవరు పుట్టినా ఓకే, అబ్బాయి పుడితే సో హ్యాపీ అన్నారు. అబ్బాయి పుడితే ఆ లోటు తీరుతుందని సుస్మిత తన అభిప్రాయం వెల్లడించారు. చిరంజీవి చిన్నమ్మాయి శ్రీజకు ఇద్దరు అమ్మాయిలు. సుస్మితకు కూడా ఇద్దరు అమ్మాయిలు. చిరంజీవికి మొదట సంతానంగా అమ్మాయి పుట్టింది. ఇలా చూసుకున్నా ఉపాసనకు అమ్మాయే పుడుతుందని అంటున్నారు.