కానీ మరికొందరు మాత్రం ఆమె చెప్పినదాంట్లో నిజం ఉందని, ఈ రోజుల్లో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయడం లేదని, అంజలి, స్వాతి, బిందు మాధవి, శ్రీదివ్య, ఆనంది, శోభిత దూళిపాళ్ల వంటి వారికి తమిళం, మలయాళంలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉందని, ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదని అంటున్నారు. ఇది నిజమే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.