Rahul Sipligunj : గల్లీలో ప్రారంభమై ఆస్కార్ వేదిక వరకు.. రాహుల్ సిప్లిగంజ్ సక్సెస్ జర్నీ.. ఇంట్రెస్టింగ్!

First Published | Mar 13, 2023, 1:33 PM IST

రాహు సిప్లిగంజ్ (Rahul Sipligunj)... ప్రస్తుతం  ఈపేరు మారుమోగుతోంది.  గల్లీలో ప్రారంభమైన రాహుల్ కేరీర్ ఈరోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేదిక వరకు వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ‘నాటు నాటు’కు ఆస్కార్ దక్కిన వేళ ఆయన గురించి కొన్ని ఇంట్రెస్టింట్ డిటేయిల్స్...
 

తన  పాటలతో యూత్ ను మరోలోకంలోకి తీసుకెళ్లాడు. ట్రెండీ ట్యూన్స్ తో యువతను ఊర్రూతలూగించాడు.. నాన్ ఫిల్మ్ సాంగ్స్ అందిస్తూ తనకంటూ ప్రత్యకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. గల్లీలో ప్రారంభమైన ఈయన కేరీర్ అంతర్జాతీయ వేదిక ఆస్కార్స్ వరకు వెళ్లడం చాలా గొప్పవిషయమనే చెప్పాలి. సెన్సేషనల్ సాంగ్ ‘నాటు నాటు’కు తన గాత్రం అందించి ఆస్కార్ కోసం హిస్టరీ క్రియేట్ చేయడంలో భాగమయ్యాడు. 

రాహుల్ సిప్లిగంజ్ పక్కా హైదరాబాదీ కుర్రాడు. అందులోనూ ధూల్ పేట్ కు చెందిన యంగ్ సింగర్. 1989 ఆగస్టు 22న రాహుల్ సిప్లిగంజ్ జన్మించాడు. ఆయ తండ్రి బార్బర్. చిన్నతనంలోనే రాహుల్ టాలెంట్ ను గుర్తించి ఓ గజల్ మాస్టర్ విఠల్ రావు వద్ద చేర్పించారు. కొన్నాళ్లు శిక్షణ పొందారు.  ఇటు సంగీతం నేర్చుకుంటూనే అంటు ఇంట్లో వారికి సహకరించేవాడు. అలా ర్యాపింగ్, హిప్ హాప్ మ్యూజిక్,  ఇండి మ్యూజిక్,  గజల్ లో చిన్నతనంలోననే మంచి పట్టుసాధించాడు. 
 

Latest Videos


రాహుల్ సిప్లిగంజ్ కేరీర్ సింగర్ గా 2009 నుంచి ప్రారంభమైంది.  తొలిసారిగా సినిమా కోసం ఆయన పాడిన పాట ‘కాలేజీ బుల్లోడ’. నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ‘జోష్’ చిత్రంలోని ఈ సాంగ్ కు అప్పట్లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పటికీ యూత్ ఇష్టపడే సాంగ్ అని చెప్పొచ్చు.  ఆ తర్వాత ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ‘దమ్ము’లో ‘వాస్తు బాగుందే - దమ్ము’ టైటిల్ సాంగ్స్ పాడాడు. సినిమా ఆడకపోయినా.. రాహుల్ పాడిన ఈ సాంగ్స్ బాగా హిట్ అయ్యాయి. 
 

దాదాపు 15 ఏండ్ల ఆయన కేరీర్ లో రాహుల్ సిప్లిగంజ్ వందకు పైగా సాంగ్స్ పాడి ఉంటారు. తొలుత సినిమా పాటలతో అవకాశాలను అందుకున్న సిప్లిగంజ్..  ప్రైయివేట్ ఆల్బమ్స్ తోనే యూత్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఆ క్రేజ్ తోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లతో కలిసి పాడే అవకాశం లభిచింది. ఎంఎం కీరవాణి, డీఎస్పీ, ఎస్ థమన్, యువన్ శంకర్ రాజా, గోపీ చందర్ ఆయా సంగీత దర్శకులతో కలిసి పనిచేశాడు. 

ఇక కీరవాణి సంగీత దర్శకత్వంలో రాహుల్ సిప్లి గంజ్ చాలా పాటలు పాడారు. రాహుల్ కు కీరవాణి అంటే చాలా ఇష్టం. ఆయన సంగీతంలో ఒక పాటకైన గాత్రం అందించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఈక్రమంలో 2009లోనే MM Keeravaniki తన పాడిన పాటలను ఓ సీడీలోకి ఎక్కించి కీరవాణికి విినిపించారంట. అప్పుడే ఈ గల్లీ బాయ్ లోని టాలెంట్ ను గుర్తించి కీరవాణి ‘దమ్ము’ చిత్రంలో అవకాశం అందించారు. అప్పటి నుంచి రాహుల్ కేరీర్ లో వేగం పెరిగింది. మరోవైపు రాహుల్ నాన్ ఫిల్మ్ సాంగ్స్ తోనూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్ తోనే  రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో అవకాశం దక్కించుకున్నారు.
 

‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ కు రాహుల్ గాత్రం అందించడం సెన్సేషన్ గా మారింది. 95వ అకాడమీ అవార్డ్స్ లో Naatu Naatuకు అవార్డు దక్కడం విశేషం. మరోవైపు ఆస్కార్ వేదికపై కాల భైరవతో కలిసి రాహుల్ లైవ్ మ్యూజిక్ పెర్ఫామ్ చేసే అవకాశం  రావడం అద్రుష్టమనే చెప్పాలి. అత్యున్నత వేదికపై రాహుల్ ‘నాటు నాటు’ పాడటంతో తెలుగు ప్రజలు, ఆయన అభిమానులు ఉప్పొంగిపోయారు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదిగిన గల్లీ బాయ్ ని ప్రశంసిస్తున్నారు. 

click me!