స్టార్‌ డైరెక్టర్ల `లక్కీ` భామలు.. శృతి హాసన్‌, పూజా, రాశీఖన్నా, మెహరీన్‌లను రిపీట్‌ చేయడానికి కారణమదేనా?

Published : Jun 17, 2022, 08:56 PM ISTUpdated : Jun 18, 2022, 09:12 AM IST

స్టార్‌ హీరోయిన్లు.. ఇప్పుడు కొందరి దర్శకులతో బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తున్నారు. సెంటిమెంట్‌ కోసం ఆ దర్శకులు ఈ హీరోయిన్లనే పదే పదే రిపీట్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ అవుతున్నారు. మరి ఆ కథేంటో చూస్తే..   

PREV
17
స్టార్‌ డైరెక్టర్ల `లక్కీ` భామలు.. శృతి హాసన్‌, పూజా, రాశీఖన్నా, మెహరీన్‌లను రిపీట్‌ చేయడానికి కారణమదేనా?

చిత్ర పరిశ్రమలో సెంటిమెంట్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారు. హీరో, దర్శకుల కాంబినేషన్ల సెంటిమెంట్‌ బాగా పనిచేస్తుంది. వాటిపై భారీ బిజినెస్‌ కూడా జరుగుతుంటుంది. హీరోహీరోయిన్ల కాంబినేషన్‌ సెంటిమెంట్‌ కూడా క్రేజీగా ఉంటుంది. తాజాగా మరో సెంటిమెంట్‌ బాగా వినిపిస్తుంది. స్టార్‌ డైరెక్టర్లకు, స్టార్‌ హీరోయిన్లు లక్కీ సెంటిమెంట్‌ అవుతున్నారు. హిట్‌ కోసం దర్శకులు వారినే తమ సినిమాల్లో హీరోయిన్లుగా రిపీట్‌ చేస్తున్నారు. తమకి కంఫర్ట్ గా ఉండే హీరోయిన్లతో వరుసగా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. 
 

27

వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ముందు వరుసలో ఉన్నారు. ఆయన పూజా హెగ్డేని రిపీట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే హరీష్‌ శంకర్‌ కూడా పూజానీ వరుసగా రిపీట్‌ చేస్తున్నారు. మరోవైపు అనిల్‌ రావిపూడి.. మెహరీన్‌ని రిపీట్‌ చేస్తున్నారు. దర్శకుడు మారుతి.. రాశీఖన్నాని, గోపీచంద్‌ మలినేని..శృతి హాసన్‌ని వరుసగా రిపీట్‌ చేస్తూ హిట్లు కొడుతున్నారు. సరికొత్త సెంటిమెంట్ కి తెరలేపుతూ హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. 
 

37

మాటల మాంత్రికుడిగా టాలీవుడ్‌లో పేరుతెచ్చుకున్న దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas) చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంటారు. కొద్దిమంది హీరోలతోనే సినిమాలు చేస్తారు. రిపీటైన కాంబినేషన్లనే రిపీట్‌ చేస్తుంటారు. `అత్తారింటికి దారేది`, `అ ఆ`లో సమంత(Samantha)ని రిపీట్‌ చేసిన ఆయన ఇప్పుడు పూజా హెగ్డే(Pooja hegde)ని వదలడం లేదు. `అరవింద సమేత`, `అల వైకుంఠపురములో` చిత్రాల్లో బుట్టబొమ్మని రిపీట్‌ చేసి హిట్‌ కొట్టాడు. ఇప్పుడు మహేష్‌బాబు చిత్రంలోనూ ఆమెనే హీరోయిన్‌గా ఎంపిక చేసి హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు. పూజా హెగ్డే.. త్రివిక్రమ్‌కి వర్క్ విషయంలో అంతటి కంఫర్ట్ నివ్వడం వల్లే ఆయన సినిమాలు చేసి హిట్లు కొడుతున్నారు. 
 

47

మరోవైపు మాస్‌ డైనమిక్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌(Harish Shankar)కి కూడా పూజానే లక్కీ సెంటిమెంట్‌ కావడం విశేషం. బన్నీతో చేసిన `డీజే` సినిమాలో పూజాని హీరోయిన్‌గా తీసుకున్న ఆయన `గద్దలకొండ గణేష్‌` లో మరోసారి రిపీట్‌ చేశాడు. ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌తో చేయబోతున్న `భవదీయుడు భగత్‌ సింగ్‌`లోనూ పూజానే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. హ్యాట్రిక్‌ కొట్టబోతున్నారు. పూజా ఉంటే సక్సెస్‌ గ్యారంటీ అన్న నమ్మకంతో మరోసారి ఆమెని హీరోయిన్‌గా తీసుకున్నారు హరీష్‌ శంకర్‌.
 

57

గోపీచంద్‌ మలినేని కూడా హీరోయిన్ ని రిపీట్‌ చేసే అలవాటుంది. ఆయన శృతి హాసన్‌(Shruti Haasan)ని కంటిన్యూగా రిపీట్‌ చేస్తూ హిట్‌ అందుకుంటున్నాడు. ఇప్పటికే `బలుపు` చిత్రంతో శృతి హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నారు. రవితేజ హీరోగా నటించిన ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఇటీవల రవితేజ-శృతి హాసన్‌ కాంబినేషన్‌లో `క్రాక్‌` సినిమా చేసి బ్లాక్‌ బస్టర్‌ అందుకున్నారు. హిట్‌ సెంటిమెంట్‌ని నిజం చేశారు. ఇప్పుడు బాలకృష్ణతో చేస్తున్న `ఎన్బీకే107` చిత్రంలోనూ శృతి హాసన్‌నే హీరోయిన్‌గా తీసుకున్నారు. హ్యాట్రిక్‌ హిట్‌కి సిద్ధమవుతున్నారు. 

67

మరో స్టార్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి(Anil Ravipudi) సైతం వరుసగా మెహరీన్‌ని రిపీట్‌ చేస్తూ హిట్ల మీద హిట్లు అందుకుంటున్నారు. రవితేజతో కలిసి `రాజాది గ్రేట్‌` చిత్రంలో బంపర్‌ హిట్‌ అందుకున్నారు అనిల్‌ రావిపూడి. ఇందులో మెహరీన్‌(Mehreen) హీరోయిన్‌ అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత `ఎఫ్‌ 2`లో రిపీట్‌ చేసి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఇటీవల ఈ సినిమా సీక్వెల్‌ `ఎఫ్‌ 3`తో మరోసారి రిపీట్‌ చేసి మరోసారి హిట్‌ని అందుకున్నారు.

77

ఇక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు రూపొందిస్తూ హిట్‌ కొట్టే దర్శకుడు మారుతి(Maruthi)కి సైతం హీరోయిన్లని రిపీట్ చేసే అలవాటుంది. ఆయన ప్రధానంగా రాశీఖన్నా(Raashi Khanna)ని రిపీట్‌ చేస్తున్నారు. `ప్రతి రోజూ పండగే` చిత్రంలో రాశీఖన్నాని హీరోయిన్‌గా తీసుకుని విజయాన్ని అందుకున్నారు మారుతి. ఇప్పుడు గోపీచంద్‌తో చేస్తున్న `పక్కా కమర్షియల్‌` చిత్రంలోనూ రాశీనే హీరోయిన్‌గా తీసుకున్నారు.ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టేలా ఉన్నారు. మరోవైపు నెక్ట్స్ ఆయన ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారు. ఇందులో ఓ హీరోయిన్‌గా రాశీఖన్నా ఉండబోతుందని టాక్‌. ఇలా మారుతి కూడా హ్యాట్రిక్‌ ప్లాన్‌ చేసినట్టు సమాచారం. అదే సమయంలో వీరంతా ఆయా దర్శకులకు కంఫర్ట్ జోన్‌ క్రియేట్‌ చేయడం వల్లే, ఇద్దరి వేవ్‌ లెంన్త్ కుదరడం వల్లే రిపీట్ చేస్తున్నారని ఆయా దర్శకుల నుంచి వినిపించే మాట. ఏదేమైనా ఇది టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవ్వడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories