సక్సెస్‌ జోరులో హాట్‌ షోతో మతిపోగొడుతున్న శృతి హాసన్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో కిల్లింగ్‌ పోజులు.. నెట్టింట వైరల్‌

Published : Feb 12, 2023, 09:32 AM ISTUpdated : Feb 12, 2023, 10:43 AM IST

శృతి హాసన్‌ టైమ్‌ నడుస్తుంది. వరుస విజయాలతో జోరు మీదుంది. దీంతో ఇప్పుడు హాట్‌ కేక్‌ అవుతుంది. మరోవైపు హాట్‌ ఫోటోలతోనూ ఎట్రాక్ట్ చేస్తుంది. సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 

PREV
17
సక్సెస్‌ జోరులో హాట్‌ షోతో మతిపోగొడుతున్న శృతి హాసన్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో కిల్లింగ్‌ పోజులు.. నెట్టింట వైరల్‌

శృతి హాసన్‌(Shruti Hassan) తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో స్టయిలీష్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్‌ కోట్‌ ధరించింది. కాళ్లకి బ్లాక్‌ స్లీవ్స్ ధరించింది. బ్లాక్‌ గ్లాసెస్‌ పెట్టుకుని, బ్లాక్‌ బ్యాగ్‌ పట్టుకుని అదిరిపోయే పోజులిచ్చింది. 
 

27

స్టయిల్‌గా నడుచుకుంటూ వెళ్తూ దిగిన ఫోటోలు, వీడియోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా అవి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓరకంగా కిల్‌ చేస్తున్నాయి. దీనికి సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. బ్లాక్‌ బ్యూటీ అని, ఫైరింగ్‌ అంటూ పోస్టు లు పెడుతున్నారు. 
 

37

ఇందులో శృతి హాసన్‌ ఓ అదిరిపోయే పోస్ట్ కూడా పెట్టింది. 2023లో నేను నల్ల వజ్రంలా మెరిసిపోవాలని నిర్ణయించుకున్నాను. అది మిమ్మల్ని కత్తిరించేంత పదునైనదిగా ఉండాలనుకుంటున్నాను అని పేర్కొంది. ఓ వైపు తన కాన్ఫిడెన్స్ ని చాటుకుంటూనే, తనపై కామెంట్లు చేసే వారికి చురకలు అంటించేలా ఉండటం విశేషం. 
 

47

శృతి హాసన్‌ రీఎంట్రీ తర్వాత జోరు పెంచింది. వరుసగా విజయాలతో దూకుడుమీదుంది. ఇప్పుడు ఆమె జోరు మామూలుగా లేదని చెప్పొచ్చు. రీఎంట్రీ పవన్‌ తో `వకీల్‌సాబ్‌` చిత్రంలో నటించింది. ఇందులో నటించింది కాసేపే అయినా సినిమా హిట్‌ కావడంతో ఈ బ్యూటీకి పేరొచ్చింది. 

57

ఆ తర్వాత `క్రాక్‌` చిత్రంతో మెరిసింది. రవితేజతో కలిసి హిట్‌ అందుకుంది. దీంతోపాటు ఈ సంక్రాంతికి ఒకేసారి రెండు సక్సెస్‌లు కొట్టింది. బాలయ్యతో `వీరసింహారెడ్డి`, చిరంజీవితో `వాల్తేర్‌ వీరయ్య` చిత్రాల్లో నటించింది. ఈ రెండు విజయాలు సాధించాయి. దీంతో శృతి క్రేజ్‌ మరింత పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఆమెది గోల్డెన్‌ టైమ్‌ నడుస్తుంది. 
 

67

ప్రస్తుతం శృతి హాసన్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌తో కలిసి `సలార్‌` చిత్రంలో నటిస్తుంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. దీంతోపాటు ఆమెకి పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వస్తున్నట్టు సమాచారం. 

77

మరోవైపు గ్యాప్‌ లేకుండా తన ప్రియుడు శాంతను హజారికాతో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది శృతి. ఇద్దరు కలిసి చేసే రొమాన్స్‌ మామూలుగా లేదు. ప్రతి రోజు ఏదో ఒక పోస్ట్ పెడుతూ తమ రిలేషన్‌షిప్‌ని చాటుకుంటున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories