మరొక అభిమాని మీకు రన్బీర్ కపూర్, రణవీర్ సింగ్‌లలో ఎవరిని ఎక్కువగా ఇష్టపడతారు అని అడగగా ఈ ప్రశ్నకు ఆమె స్పందిస్తూ 'ఇద్దరూ ఇష్టమే' అని చెప్పింది. చివరిగా ఓ అభిమాని మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా? అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానంగా, కరిష్మా ఒక అమ్మాయి ఫోటో ఉన్న జిఫ్ షేర్ చేసింది. అంతే కాకుండా దాని మీద 'డిపెండ్స్' అంటూ రాసుకొచ్చింది. అంటే ఆమె చేసుకోను అని చెప్పలేదు, అలాగే చేసుకుంటాను అని కూడా చెప్పలేదు. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది అని చెప్పుకొచ్చింది.