లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీ ట్విట్టర్ టాక్, ఈ సినిమా సంతోష్ శోభన్ కెరియర్ కు బూస్ట్ ఇస్తుందా..?

First Published | Nov 4, 2022, 6:23 AM IST

సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ ఈ మూవీ ఈరోజు థియేటర్లలో సందడి చేయబోతుంది.  అంతకంటే ముందూ  ఈమూవీ ప్రిమియర్స్ తో సందడి చేసింది. సినిమా చూసిన  ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరి వాళ్లేమంటున్నారో చూద్దాం. 
 

ఆముక్త క్రియేషన్స్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్  లో రిలీజ్ అయ్యింది లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమా .చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టిన సంతోష్ శోభన్  హీరోగా.. జాతిరత్నాలు సినిమాతో దడదడలాడించిన ఫరియా అబ్డుల్లా హీరోయిన్ గా నటించడంతో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. మరి వాటిని ఈ మూవీ అందుకుందా..?
 

 మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ లవ్ అండ్ క్రైమ్ ఎంటర్‌టైనర్  మూవీ లైక్ షేర్ & సబ్‌స్క్రైబ్ మూవీ  ప్రమోషన్స్ తో తెగ సందడిచేశారు. ముఖ్యంగా ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్‌ ను యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్  చేయగా.. ప్రభాస్ తో పాటు నాగార్జున,చిరు, సాయి ధరమ్ తేజ్ లాంటి స్థార్స్  సినిమాకు సపోర్ట్ చేశారు. మరి ఈసినిమా ప్రిమియర్స్ చూసిన జనం ఏమని ట్వీట్ చేస్తున్నారంటే


ఈసినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు యూట్యూబర్స్. సోషల్ మీడియా పిచ్చితో ఏ పని చేసినా.. లైక్ లకోసం.. తమ వీడియోలు వైరల్ అవ్వాలని చేస్తుంటారు. అటువంటి వారి జీవితంలో జరిగిన సీరియస్ సంఘటనల సమాహారమే ఈ లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమా. కాని ఈమూవీ ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకున్నట్టుగా లేదు.

లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమాపై యావరేజ్ టాక్ వినిపిస్తుంది. రొటీన్ స్టోరీలైన్ తో.. నవ్వు రాని కామెడీతో సినిమా బిలో యావరేజ్ గా ఉంది అంటున్నారు ఆడియన్స్. అక్కడక్కడ మాత్రమే కాస్త నవ్వుకుంటాం కాని... సినిమా అంతా   ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలు లేవుఅంటున్నారు జనాలు. 

మరికొదరు మాత్రం ఈసినిమా ఓటీటీకి మాత్రమే పనికొస్తుందని... థియేటర్లో చూడదగ్గ సినిమా ఇది కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతే కాదు ఇటువంటి సినిమాలను థియేటర్ కు వెళ్ళి చూడాలనే ఇంట్రస్ట్ ఆడియన్స్ లో ఏదు అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమాలో కొంత మంది ఆడియన్స్ కు నచ్చిన ఒకే ఒక అంశం లచ్చువమ్మో సాంగ్. ఈసాంగ్ తమకు బాగా నచ్చిందంటూ కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. ఈ పాట లొకేషన్లు కూడా బాగున్నాయి అంటున్నారు ఆడియన్స్. మిగతా సినిమాఎలా ఉన్నా.. ఈ పాట మాత్రం ఆకట్టుకుంటుంది. 

ఇక ప్రతీ ఒక్క ప్రేక్షకుడు ఎదురుచూసే ఇంట్రవెల్ ఎపిసోడ్ చాలా పూర్ గా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతే కాదు కామెడీ కోసం ఎంత ప్రయత్నంచేసినా..పెద్దగా వర్కైట్ అవ్వలేదంటూ కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. 


మొత్తానికి ఈసినిమాను థియేటర్ కు సూట్ కాదు అని తేల్చేశారు జనాలు. సంతోష్ శోభన్, ఫరియా అబ్ధుల్లా యాక్టింగ్ కు ఏమాత్రం వంక పెట్టడానికి లేదు. కాని సినిమా కథలో పస ఉండాలి కదా. ఏక్ మినీ కథతో సంతోష్.. జాతిరత్నాలు లాంటిసినిమాలతో ఫరియాకు మంచి పేరు వచ్చింది. కాని ఈ మూవీ యావరేజ్ టాక్ తో ఇబ్బంది తప్పేట్టు లేదు. 

ఎక్కువమంది ఆడియన్స్ ఈ మూవీ ఎప్పుడు ఓటీటీప్లాట్ ఫామ్ ఎక్కుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఈరోజు థియేటర్ లోకి వస్తున్న లైక్ షేర్ &సబ్‌స్క్రైబ్ సినిమా ఎంత వరకూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందో.. టోటల్ గా ఫలితం ఎలా వస్తుందో చూడాలి మరి. 

Latest Videos

click me!