వివాదాలకు, రూమర్స్ కి నిత్యా మీనన్ దూరంగా ఉంటుంది. కానీ ఇటీవల నిత్యా మీనన్ ని వరుస రూమర్స్ చుట్టుముడుతున్నాయి. నిత్యామీనన్ త్వరలో ఓ స్టార్ హీరోని వివాహం చేసుకోబోతోంది అంటూ ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ పై నిత్యామీనన్ స్వయంగా క్లారిటీ ఇచ్చింది. తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్ లో నిజం లేదని.. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని తేల్చేసింది.