విజయ్‌ దేవరకొండ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. అర్థరాత్రి సర్‌ప్రైజ్‌తో భావోద్వేగం..

Published : Apr 29, 2022, 08:42 PM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమా షూటింగ్‌లో సీన్‌ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యింది. విజయ్‌ దేవరకొండ చేసిన పనికి ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతుంది.   

PREV
16
విజయ్‌ దేవరకొండ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న సమంత.. అర్థరాత్రి సర్‌ప్రైజ్‌తో భావోద్వేగం..

సమంత(Samantha) గురువారం తన 35వ పుట్టిన రోజు జరుపుకుంది. చాలా సింపుల్‌గానే సెలబ్రేట్‌ చేసుకుంది. తన పర్సనల్‌ టీమ్‌ సమక్షంలో కేక్‌ కట్‌ చేసింది. ఉన్నంతలో బెటర్‌గా ఈ సారి బర్త్ డేని సెలబ్రేట్‌ చేసుకుంది. ఎలాంటి ఆడంబరాలకు పోకుండా అలా సింపుల్‌గానే కానిచ్చేసింది సమంత. ఎప్పటిలాగే ఆమె తన పుట్టిన రోజు కూడా సినిమా షూటింగ్‌లో బిజీ అయిపోయింది. Samantha Birthday.

26

ప్రస్తుతం సమంత విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda)తో కలిసి ఓ సినిమా చేస్తుంది. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం కాశ్మీర్‌లో జరుగుతుంది. బుధవారం అర్థరాత్రి కూడా ఈ చిత్ర షూటింగ్‌ ప్లాన్‌ చేశారు దర్శకుడు శివ నిర్వాణ. సమంత, విజయ్‌ దేవరకొండలపై వచ్చే సీన్‌ అది. సమంత ఊరెళ్లిపోతుందని విజయ్ దేవరకొండ ఓ గోడపై దిగాలుగా కూర్చుంటాడు. ఆ సమయంలో సమంత వచ్చి, `ఎందుకిలా ఉన్నావ్‌, నేను వెళ్లిపెతున్నందుకా? పది రోజుల్లో వచ్చేస్తా. నువ్వు మా ఊరొచ్చి మా తల్లిదండ్రులతో మాట్లాడటం కాదు, నేనే మీ వాళ్లతో మాట్లాడి మన పెళ్లికి ఒప్పిస్తా` అంటూ సమంత చెప్పింది. 
 

36

సమంత డైలాగులన్నీ అయిపోకాక.. విజయ్‌ రియాక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. కానీ సస్పెన్స్ లో పెట్టాడు రౌడీబాయ్‌. ఆ వెంటనే సమంత వైపు తిరిగి `సమంత.. హ్యాపీ బర్త్ డే` అంటూ గట్టిగా చెప్పేశాడు. సమంత ఇంకా తేరుకోలేరు. తన పేరు సమంత అని పిలిచాడేంటి అనేలా రియాక్షన్‌ ఇచ్చింది. అంతలోనే తన బర్త్ డే అని తెలిసి షాకయ్యింది సామ్‌. ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యింది. కన్నీటి పర్యంతమయ్యింది. 

46

ఆ వెంటనే పక్కనే ఉన్న టీమ్‌ ఓ పెద్ద కేక్‌ తీసుకొచ్చి సమంతకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేక్‌ కట్‌ చేసి సామ్‌ ఆనందాన్ని పంచుకుంది. తన బర్త్ డేని ఇంతటి సర్‌ప్రైజింగ్‌గా ప్లాన్‌ చేయడంతో ఆమె భావోద్వేగానికి గురయ్యింది. ఈ వీడియోని యూనిట్‌ సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా వైరల్‌ అవుతుంది. 

56

ఇదిలా ఉంటే తనకు పుట్టిన రోజు తెలిపిన సెలబ్రిటీలు, సినీ ప్రముఖలు, అభిమానులు, ఇలా అందరికి థ్యాంక్స్ చెప్పింది సమంత. సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టింది. `నా పుట్టినరోజు నాడు ప్రేమతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ అందరి  ప్రోత్సహం, స్ఫూర్తి, సానుకూలతలకు నేను ఎప్పటికీ కృతజ్ఞురాలినే. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు మీరంతా నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపారు` అని ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలోవైరల్‌ అవుతుంది. 

66

నాగచైతన్యతో విడిపోయాక వచ్చిన సమంత మొదటి బర్త్ డే ఇది. దీంతో ఆమె మనసులో ఏదో లోటు ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరోవైపు డైవర్స్ తర్వాత సమంత మరింత ఫుల్‌ స్వింగ్‌లో దూసుకుపోతుంది. అరడజను సినిమాలకు కమిట్‌ అయ్యింది. అందులో `శాకుంతలం`, `యశోద`, డ్రీమ్‌ వారియర్స్ చిత్రం, విజయ్‌ దేవరకొండ మూవీ, ఓ అంతర్జాతీయ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories