Samantha Vs Rashmika: బాలీవుడ్ లో సమంత వర్సెస్ రష్మిక, వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వార్ కు కారణం..?

First Published | Jul 28, 2022, 8:46 AM IST

స్టార్ సీనియర్ హీరోయిన్ సమంత, నేషనల్ క్రష్ రష్మిక వీరిద్దరి మధ్య నివురు కప్పిన నిప్పులా వార్ జరుగుతుందట. ఇద్దరి మధ్య పోటీ పరిగిపోయి ఉప్పు నిప్పులా మారిపోయారంటున్నారు సినీ జనాలు. ఇంతకీ వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ ఎలా మొదలయ్యింది..? అసలు కారణం ఏంటీ..? 

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతోంది సమంత. 35 ఏళ్లు వచ్చినా.. కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ దూసుకుపోతోంది.  అసలు హీరోయిన్లు ఈ ఏజ్ వరకూ ఫీల్డ్ లో ఉండటమే తక్కువ. అటువంటిది స్టార్ హీరోయిన్ రేస్ లో ఇప్పటికీ గెలుస్తూనే ఉంది సామ్. 

ఇక సౌత్ లోనే కాదు పాన్ ఇండియా హీరోయిన్స్‌ లిస్ట్ లో కూడా  సమంత టాప్ లో ఉంది. రీసెంట్ గా ఆర్‌ మాక్స్‌ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా  సమంత పాన్ ఇండియా రేంజ్ లో  నెంబర్‌ వన్‌ ప్లేస్ పై పాగా వేసింది. దాంతో  ప్రస్తుతం సమంత బాలీవుడ్ పైన తన  ఫోకస్‌ అంతా పెట్టింది. 


బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది సామ్. అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గా పాగా వేయాలని చూస్తోంది. సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ పోతోంది  కాని.. బయటకు మాత్రం.. ఆసినిమాలపై ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. దానికి కారణం రష్మిక అని  తెలుస్తోంది. రష్మిక స్పీడ్ కు బ్రేక్స్ వేసేందుకే సామ్ ఇలా చేస్తుందన్న టాక్ వినిపిస్తోంది. 

బాలీవుడ్ పై ఎప్పటి నుంచో కన్నేసి ఉంచిన రష్మిక మందన్న  పుష్ప సినిమాతో అక్కడ కూడా భారీగా పాపులారిటీని సాధించింది.  తను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుండటంతో.. వరుసగాసినిమాలు కమిట్ అవుతుంది. అయితే పుష్ప సినిమాతో సౌత్ హీరోయిన్ గా బాలీవుడ్ కు వెళ్లింది కాని.. రష్మిక  నటించిన హిందీ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ అవ్వలేదు. 

మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ లాంటి భారీ సినిమాలతో బాలీవుడ్ లో బిజీగా ఉంది రష్మిక. ఇక బాలీవుడ్ లో రష్మికను కట్టడి చేయడానికి సమంత రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు సైలెంట్ గా ఉండి.. తను చేస్తున్న బడా బాలీవుడ్ సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేసేలా సమంత ప్లాన్ చేసుకుంటుందట. ఇప్పటికే సమంతకు బీటౌన్ లో మంచి ఇమేజ్ వచ్చింది. 

సమంతకు ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లో మంచి ఇమేజ్ వచ్చింది. రష్మికకు పుష్ప సినిమాతో నార్త్ లో క్రేజ్ వచ్చింది. ఇద్దరూ ఈ ఇమేజ్ లను వాడుకుని అక్కడ పాగా వేయాలని చూస్తున్నాు. సమంత దాదాపు అక్కడ గ్రీప్ సాధించింది. రష్మికకు మాత్రం ఇంకా పట్టు చిక్కడం లేదు. అక్కడ రష్మిక డైరెక్ట్ హిందీ సినిమా ఏదైనా రిలీజ్ అయితే బాలీవుడ్ పై రష్మిక ప్రభావం పెరిగే అవకాశం ఉంటుంది. 
 

అందుకే తాను చేయబోతున్న బాలీవుడ్ సినిమాలను ఒకేసారి అనౌన్స్ చేసి రష్మిక కు షాక్ ఇవ్వాలనుకుంటోందట. అటు రష్మిక కూడా దొరికిందే ఛాన్స్ గా బాలీవుడ్ సినిమాల స్పీడ్ పెంచేసింది. అక్కడి నుంచి ఏ అవకాశం వచ్చినా వదిలే పరిస్థితి లేదు. అవసరం అయితే సౌత్ ను సాక్రీఫైజ్ చేసి అయినా.. బాలీవుడ్ లో పాగా వేస్తానంటోంది రష్మిక. వీరిద్దరి కోల్డ్ వార్ ను ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తిగా గమనిస్తోంది. ఇక బాలీవుడ్‌లో సామ్ వర్సెస్ రష్మిక వార్  ముందు ముందు ఎలా ఉండబోతోందో చూడాలి మరి.  

Latest Videos

click me!