1.5 లక్షల బ్యాగు నుంచి 2.5 కోట్ల కోట్ల కారు వరకు... సమంత దగ్గరున్న అత్యంత ఖరీదైన వస్తువుల లిస్ట్ తెలుసా..?

Published : Apr 28, 2022, 08:55 AM ISTUpdated : Apr 28, 2022, 09:04 AM IST

స్టార్‌ హీరోయిన్‌ సమంత ఫ్యాషన్‌కి మారుపేరు. లగ్జరీకి కేరాఫ్‌. ఆమె ధరించే ప్రతిదీ లగ్జరీగా ఉండటం విశేషం. నేడు బర్త్ డే జరుపుకుంటోన్న సమంత ఆమె లగ్జరీ కార్లు, కాస్ట్లీ బ్యాగులు వాటి విశేషాలేంటో ఓ లుక్కేద్దాం.   

PREV
16
1.5 లక్షల బ్యాగు నుంచి 2.5 కోట్ల కోట్ల కారు వరకు... సమంత దగ్గరున్న అత్యంత ఖరీదైన వస్తువుల లిస్ట్ తెలుసా..?

సమంత మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన హీరోయిన్‌. చదువుకునేందుకు డబ్బుల్లేని పరిస్థితుల్లో ఫంక్షన్లలో వెల్‌కమ్‌ గర్ల్ గా పనిచేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టి  చిత్ర రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో తెలుగు ఆడియెన్స్ మదిని దోచుకుంది సమంత. ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది. అయితే దాని వెనకాల ఎంతో స్ట్రగుల్‌ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

26

ఒకప్పుడు మనీ కోసం ఇబ్బందులు పడ్డా సమంత ఇప్పుడు కోటీశ్వరురాలిగా ఎదిగింది. సినీ రంగంలో స్టార్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఆమె ఎంతో కసితో తాను ఎంచుకున్న రంగంలో రాణించింది. అందుకోసం ఎంతో కష్టపడింది. ఒడిదుడుకులను ఎదుర్కొని విజేతగా నిలిచింది. ఎంతో మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలిచింది. నేడు(ఏప్రిల్‌ 28) సమంత తన 35వపుట్టిన రోజుని జరుపుకుంటోంది. 

36

బర్త్ డే సందర్భంగా సోషల్‌ మీడియాలో సమంత ట్రెండ్‌ అవుతుంది. ఆమెకి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అందులో భాగంగా ఆమె ధరించే బ్యాగులు, కార్లు, హీల్స్ లు, వారి వెరైటీ, వాటి కాస్ట్ వంటి విషయాలు ఆసక్తి క్రియేట్‌ చేస్తున్నాయి. సమంత ఇప్పుడు ఫ్యాషన్‌ కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఫ్యాషన్‌ రంగంలోకి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తూ, ఫ్యాషన్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తుంది సమంత. 

46

అందులో భాగంగా సమంత వాడే బ్యాగులు, వాటి వివరాలు, ధరలు ఇంట్రెస్ట్ ని క్రియేట్‌ చేస్తున్నాయి. అవి అత్యంత కాస్ట్లీగా ఉండటం విశేషం. సమంత వద్ద వైఎస్‌ఎల్‌ లవ్‌ బాక్‌ క్లచ్‌ బ్యాగ్‌, బట్టేగా వెనెటా పంచ్‌ స్లింగ్‌ బ్యాగ్‌, ప్రద వింటేజ్‌ బ్యాగ్‌, లూయిస్‌ వుయిట్టన్‌ బ్లీకర్‌బ్యాగ్‌, లూయిస్‌ వియుట్టన్‌ ట్విస్ట్ బ్యాగ్‌ వంటి లగ్జరీ బ్యాగులున్నాయి. వీటి ధర ఏకంగా లక్షా నలభై వేలు ఉండటం విశేషం. సమంత వాడే బ్యాగులు చాలా వరకు వరల్డ్ క్లాస్‌ మోడల్స్. ఆమె వాడే ప్రతి బ్యాగ్‌ లక్ష రూపాయల వరకు ఉంటాయని తెలుస్తుంది. బ్యాగ్‌ల విషయంలో ఆమె కాంప్రమైజ్‌ కాదని తెలుస్తుంది. 

56

మరోవైపు కార్ల విషయంలోనూ తగ్గేదెలే అంటోంది సమంత. ఆమె వద్ద ఆరు లగ్జరీ కార్లున్నట్టు సమాచారం. వాటిలో రూ.72 లక్షల విలువలై జాగ్వర్‌ ఎక్స్ ఎఫ్‌ కారు, 83 లక్షల విలువైన ఆడి క్యూ7, కోటీ నలభై ఆరు లక్షల విలువైన స్వాంకీ పోర్చే కేమన్‌ కారుంది. వీటితోపాటు 2.26 కోట్ల విలువ చేసే రేంజ్‌ రోవర్‌ కారు, 2.55కోట్ల మెర్సిడేజ్‌ బెంజ్‌ జీ63, 1.42కోట్ల విలువలైన బీఎండబ్ల్యూ7 సిరీస్‌ కారు సమంత ఇంట్లో ఉండటం విశేషం.
 

66

ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలిచే సమంత హై హీల్స్ రేట్‌ ధర తెలిస్తేనూ మతిపోతుంది. ఆమె మనోలో బ్లాక్‌ హై హీల్స్ వాడుతుంది. ఇంటర్నేషనల్‌ బ్రాండ్‌ అయిన వీటి ధర  ఏకంగా లక్ష రూపాయలు ఉంటుందని టాక్‌. ఇదిలా ఉంటే సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమె తమిళంలో నటించిన `కాథు వాకుల రెండు కాదల్‌` చిత్రం నేడు తెలుగు, తమిళంలో విడుదలవుతుంది. ఇందులో విజయ్‌ సేతుపతి,నయనతారలతో కలిసి సమంత నటించింది. విఘ్నేష్‌ శివన్‌ దర్శకుడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories