రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత కలిసి `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు సినిమాలోని పాటలు చార్ట్ బస్టర్ అయ్యాయి. మిలియన్స్ వ్యూస్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో `ఖుషి` మ్యూజిక్ కాన్సర్ట్ ఏర్పాటు చేసింది యూనిట్. స్వాతంత్రదినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో భారీగా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. నోవాటెల్‌లో ఈవెంట్ జరుగుతుంది. వేల మంది అభిమానులు ఈ ఈవెంట్‌లో పాల్గొనడం విశేషం. దీంతో హోరెత్తిపోయింది.
అయితే ఇందులో విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఈవెంట్ స్టేజ్‌పైకి వచ్చారు. వీరి రాకతో ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఇద్దరు రాకింగ్ లుక్‌లో అదరగొట్టారు. ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది.
అయితే ఇందులో విజయ్ దేవరకొండ, సమంత కలిసి ఈవెంట్ స్టేజ్‌పైకి వచ్చారు. వీరి రాకతో ఆడిటోరియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తిపోయింది. ఇద్దరు రాకింగ్ లుక్‌లో అదరగొట్టారు. ఈవెంట్‌కి హైలైట్‌గా నిలిచింది.
ఇందులో విజయ్ దేవరకొండ వైట్ కోట్, ఫ్యాంట్ ధరించారు. సమంత బ్లాక్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఆమె టాప్ షోతో మైండ్ బ్లాక్ చేసింది. ఈవెంట్‌కి అదిరిపోయే గ్లామర్ తీసుకొచ్చింది. అయితే ఈవెంట్‌లో సమంత, విజయ్ కలిసి చేసిన పని హైలైట్‌గా నిలిచింది.
మ్యూజిక్ కాన్సర్ట్ వేదికపైకి వచ్చిన విజయ్ దేవరకొండ, సమంత.. అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. వెస్టర్స్ డాన్సులతో అదరగొట్టారు. సమంతతో కలిసి స్టేజ్‌పైకి వచ్చిన విజయ్.. తన షర్ట్ విప్పేసి మరీ సమంతతో కలిసి డాన్సు చేయడం హైలైట్‌గా నిలిచింది.
రౌడీ బాయ్ విజయ్ షర్ట్ విప్పుతుంటే ఈవెంట్ మొత్తం అరుపులతో దద్దరిల్లిపోయింది. ఆ తర్వాత సమంతతో కలిసి ఆయన చేసి క్రేజీ డాన్సు పిచ్చెక్కించేలా ఉంది. ఆమె ఎత్తుకుని, ఒక హ్యాండ్‌తో తీసుకుని చేసిన డాన్సు మైండ్ బ్లోయింగ్ అనిపించేలా ఉంది.
మరోవైపు రొమాంటిక్ చూపులతో వాళ్లు చేసిన స్టెప్పులు, మూమెంట్స్ నెక్ట్స్ లెవల్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంట్రీగా ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు. ఓ పదినిమిషాలపాటు స్టేజ్‌ని షేక్ చేసిందీ జోడీ.
ఆడియెన్స్ మధ్యలోకి వెళ్లి పాట పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ వాహబ్‌తో కలిసి ఆడియెన్స్ చేత పాట పాడించారు. దీంతో మరోసారి ఈవెంట్ మొత్తం హోరెత్తిపోయింది. ఇందులో విజయ్ షర్ట్ విప్పి సమంతతో డాన్సు చేయడమే హైలైట్‌గా నిలవడం విశేషం.
ఇక ఈ ఈవెంట్‌లో విజయ్, సమంతతోపాటు దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు, విజయ్ ఫాదర్ గోవర్థన్, అమ్మ, తమ్ముడు హీరో ఆనంద్ దేవరకొండ, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్ పాల్గొన్నారు.
`ఖుషి` మ్యూజికల్ కాన్సర్ట్ లో దర్శకుడు శివ నిర్వాణతో కలిసి విజయ్ దేవరకొండ. ఈవెంట్‌లో తనదైన డైలాగ్‌లతో దర్శకుడు సైతం అలరించారు.
విజయ్, సమంత కలిసి నటించిన `ఖుషి` మ్యూజికల్ ఈవెంట్‌కి భారీగా ఆడియెన్స్ తరలి వచ్చారు. వేల మందిగా రావడంతో నోవాటెల్ మొత్తం కిక్కిరిసి పోయింది.