ముందే చెప్పారు రిషి మనసులో నువ్వు లేవు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది అని నేనే నమ్మలేదు.కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని అంటుంది సాక్షి.నాకు ఇంక ఈ ఎంగేజ్మెంట్ వద్దు ఈ పెళ్లి వద్దు, నువ్వు వద్దు, నీ కుటుంబం వద్దు. నువ్వు మీ తల్లిని కాదంటే తనదే తప్పు అనుకున్నాను కానీ నీదే తప్పు నీకే ప్రేమించడం రాదు. నీకో దండం, నీ ప్రేమకో దండం, నీ పెంపకానికో దండం అని అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సాక్షి. సాక్షి ఆ ఉంగరాన్ని నేలకు విసురుతోంది.