మనం ఇద్దరం లైబ్రెరీలో ఉన్నాం.. కాలేజ్ టైమ్ కూడా అయిపోయింది. నువ్వు నన్ను ఇంటర్వ్యూకు అని పిలిచావ్.. నేను వచ్చాను.. లైబ్రెరీకి పిలిచావ్ నేను వచ్చాను.. ఇక్కడ ఏం జరిగింది అనేది అన్ని కలిపించి చెప్తాను. అందరిని పిలుస్తాను, నమ్మిస్తాను.. నన్ను ఒంటరిగా బంధించి అల్లరి చెయ్యబోయావ్ అని చెప్తాను అంటుంది. అంతేకాదు నీ పరువు నీ కాలేజ్ పరువు మొత్తం తీస్తాను అని అంటుంది.