RRR సత్తా.. నాలుగు కేటగిరీల్లో ప్రతిష్టాత్మక HCA ఫిల్మ్ అవార్డ్స్.. చరణ్ కూ ‘స్పాట్ లైట్’ అవార్డు సొంతం .!

First Published | Feb 25, 2023, 1:35 PM IST

అంతర్జాతీయ వేదికపై బ్లాక్ బాస్టర్ యాక్షన్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. తాజాగా హాలీవుడ్ అవార్డ్స్ వేదికలో ఏకంగా నాలుగు కేటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకుని హౌరా అనిపించింది.
 

ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు అవార్డులనూ సొంతం చేసుకుంటోంది యాక్షన్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’RRR. ఇప్పటికే  అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టి హిస్టరీ క్రియేట్ చేసింది.  తాజాగా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకొని రికార్డు క్రియేట్ చేసింది. 
 

తాజాగా అమెరికాలో నిర్వహించిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్ లోనూ ‘ఆర్ఆర్ఆర్’ సత్తా చాటింది. ఏకంగా నాలుగు కేటగిరీల్లో ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డులను సొంతం చేసుకొన్న ఇండియన్ సినిమగానూ  రికార్డు క్రియేట్ చేసింది. 
 


HCA ఫిల్మ్, క్రియేటివ్ ఆర్స్ అవార్డ్స్ ల ప్రదానోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ నాలుగు అవార్డులను గెలుచుకుంది. అందులో Best International filmగా అవార్డును సొంతం చేసుకుంది. ఈ కేటగిరీలో ఇప్పటికే ‘సాన్ డిగో ఫిల్మ్ క్రిటిక్స్’ మరియు ‘సాటర్న్ అవార్డ్స్’నూ సొంతం చేసుకోవడం విేషం.  

అలాగే, బెస్ట్ స్టంట్స్ (Best Stunts) కేటగిరీలోనూ ‘ఆర్ఆర్ఆర్’కు అవార్డు దక్కడం విశేషం. చిత్రంలోని యాక్షన్  సన్నివేశాలకు ఆడియెన్స్ ఫిదా కావడంతో పాటు.. హాలీవుడ్ దర్శకులు, ప్రముఖుల నుంచీ ప్రశంసల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. 
 

బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ (Best Action Film) కేటగిరీల్లోనూ  ‘ఆర్ఆర్ఆర్’ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ ఫిల్మ్  అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఇదే విభాగంలోనూ రీసెంట్ గా ‘క్రిటిక్స్ ఛాయిస్ సూపర్ అవార్డ్స్’ను అందుకున్న విషయం తెలిసిందే. 

‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్ కూడా ‘బెస్ట్ సాంగ్’ కేటగిరీలో HCA ఫిల్మ్ అవార్డ్స్ ను సొంతం చేసుకుంది.  హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ ఫిల్మ్ అవార్డ్స్ నుంచి ఇలా నాలుగు కేటగిరీల్లో అవార్డులను అందుకుంది. ఈ సాంగ్ ‘ఆస్కార్స్2023’ బరిలోనూ ఓరిజినల్ సాంగ్ నామినేట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 12న అమెరికాలో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. 
 

HCA అవార్డ్స్ లో పాల్గొన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కు (Ram Charan)కు  కూడా Spotlight అవార్డును అంద జేశారు. అవార్డ్ ప్రజెంటర్ గానూ ఈవేదికపై అరుదైన గౌరవం అందుకున్న చరణ్ ను అవార్డుతో సత్కరించారు. మరోవైపు అంతర్జాతీయ వేదికపై చరణ్ విధేయంగా ప్రవర్తించడం ప్రశంసలను కురిపిస్తోంది. వినయంగా మెదులుతూ చాలా చక్కటి స్పీచ్ తో అదరగొట్టాడు. ప్రతి ఒక్కరికీ తెలుగువారి నమస్కారం చేసి ఆకట్టుకున్నారు. ఈవెంట్ లో చరణ్ స్పీచ్ కు గెస్ట్ లు ఫిదా అయ్యారు. 

Latest Videos

click me!