బిగ్ బాస్ కి వెళ్లినందుకు ఆర్ జే సూర్య అన్ని లక్షలు తీసుకున్నాడా..? స్వయంగా వెల్లడించిన పులిహోర రాజా..?

First Published | Nov 1, 2022, 7:11 PM IST

బిగ్ బాస్ నుంచి తాజాగా బయటకు వచ్చేశాడు ఆర్జే సూర్య. బుల్లితెరపై మంచి పాపులారిటీ సాధించిన సూర్య.. బిగ్ బాస్ కి వెళ్లి 8 వారాలు ఉన్నాడు. మరి ఇన్ని వారాలు ఉన్నందుకు సూర్యకు ఎన్ని లక్షలు గిట్టుబాటు అయ్యాయో తెలుసా..?
 

ఏంటో ఈసారి బిగ్ బాస్ రకరకాలుగా ఉంది. ప్రతీ సీజన్ లో కాస్తో కూస్తో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉండేది. ఒక్క పాయింట్ దగ్గర అయినా ఆడియ్స్ కనెక్ట్ అయ్యేవారు... చూసేవారు..కాని ఈసారి  సీజన్ 6లో మాత్రం  రకరకాలుగా ఉన్నారు జనాలు. అందుకే ఈసారి బిగ్ బాస్ సీజన్ 6ను అసలు వాళ్లే వదిలేశారన్న విమర్షలు ఉన్నాయి. 

అందుకే.. ఆడేవాళ్లు ఎవరు.. ఆడనివాళ్లు ఎవరు.. ఉండాల్సిన వాళ్లు ఎవరు.. ఉండకూడనిది ఎవరు అన్న తేడా లేకుండా వారం తిరిగే సరికి కళ్లు మూసుకుని ఎవరినో ఒకరిని బయటకు పంపిచేస్తున్నారు అన్న విమర్ష ఉంది. ఇక ఈ క్రమంలోనే 8 వీక్ లో బయటకు వచ్చాడు పులిహోర రాజ ఆర్ జే సూర్య. స్ట్రాంగ్ ప్లేయర్... స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అయినా సరే ఎందకు బయటకు వచ్చాడు అన్న అనుమానాలు చాలా ఉన్నాయి. 
 


ఇక అన్నింటికంటే ఇంపార్టెంట్ విషయం ఎలిమినేషన్. ఇప్పటికే చాలా మంది ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మరి అందులో ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అంటే..? అది టాప్ సీక్రేట్ అని చెప్పకుండా తప్పించుకుంటారు. అటువంటిరి రీసెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసిన  ఆర్జే సూర్య మాత్రం.. నా రెమ్యూనరేషన్ ఇంతా అని హింట్ ఇచ్చేశాడు. 

ఒ ఇంటర్వ్యూలో మాట్లాడిన సూర్య. తన రెమ్యూనరేషన్ గురించి ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..  మీకే హింట్ ఇస్తున్నా మీరే తెలుసుకోండి అని అన్నాడు. తను నెల మొత్తం కష్టపడితే జీతాన్ని బిగ్ బాస్ వాళ్లు వారంలో ఇచ్చారని చెప్పాడు. ప్రస్తుతం ఆర్జే సూర్య యాంకర్‌గా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో పని చేస్తున్నాడు. స్పెషల్ ప్రోగ్రామ్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. 

తను చేస్తున్న ఉద్యోగం ద్వారా  ఆర్జే సూర్య 60 వేల వరకు ఉందని సమాచారం. అంటే బిగ్ బాస్ హౌస్‌లో నెలకి ఇచ్చే జీతం వారానికే వచ్చిందంటున్నాడు. ఈ లెక్కన చూసుకుంటే ఆర్జే సూర్య బిగ్ బాస్ హౌస్‌లో 8 వారాలు ఉన్నాడు. ఈ 8 వారాలకు  దాదాపు 5 లక్షల పైనే రెమ్యూనరేషన్ తీసుకున్నాడట సూర్య. అయితే ఈలెక్కన సూర్య బయట ప్రోగ్రామ్స్ ద్వారా సంపాధించే డబ్బుకన్నా ఇది చాలా తక్కువే అని తెలుస్తోంది. 

అయితే మరో మాట ఏం వినిపిస్తుందంటే.. సూర్యకు వారానికి దాదాపు లక్షన్నర పైనే ఇచ్చారు.. ఈ ఎనిమిది వారాలకు కలిపి దాదాపు 12 లక్షల వరకూ వసూలు చేశాడని మరో మాటగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.  ఏది ఏమైనా బయట మంచి పాపులారిటీ ఉన్న సూర్య.. బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్స్ నడిపి.. పులిహోర రాజా అన్న పేరు సంపాధించాడు. ఉన్న పేరును చెడగొట్టుకున్నాడు అని అంటున్నారు జనాలు. 

Latest Videos

click me!