Krishna Mukundha Murari: భర్త మీద కోపంతో రగిలిపోతున్న రేవతి.. తెలియకుండా చిక్కుల్లో పడుతున్న మురారి!

First Published | Apr 8, 2023, 12:37 PM IST

Krishna Mukundha Murari: స్టార్ మా లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకు సాగుతుంది. అమాయకురాలైన ఆడపడుచుకి  మంచి జీవితాన్ని ఇవ్వాలని తపన పడుతున్న ఒక వదిన కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

ఎపిసోడ్ ప్రారంభంలో మురారి కృష్ణని ఎక్కడ ఉన్నావు అని అనగా మీరే పోల్చుకోండి ఎసిపి సర్ అని అంటుంది. పాటలు వస్తున్నాయి క్యాబ్లో ఉన్నావా పాటలు సౌండ్ తగ్గించు అని అంటాడు మురారి.క్యాబ్ లోనే ఉన్నాను ఇంటి ముందు ఉంటాను అని కృష్ణ ఫోన్ పెట్టేస్తుంది కృష్ణ. అల్లరి పిల్ల  అనుకుంటాడు మురారి. మరోవైపు రేవతి భవానికి ప్రసాదం ఇస్తూ మీరు కూడా వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అక్క అని అంటుంది. ఇంట్లో మీరు ఉండకూడదనే కావాలని మిమ్మల్ని అక్కడికి పంపించాను నువ్వు ఆ కృష్ణ ఒక మాట మీదే ఉంటారని తెలుసు. అందుకే ఈ ప్లాన్ వేశానని భవాని అనుకుంటుంది. ఇంతలో కృష్ణ అక్కడికి వస్తుంది. నువ్వు కూడా ప్రసాదం తీసుకో కృష్ణఅంటుంది భవాని.
 

కరెక్ట్ టైం కి ప్రసాదం తెచ్చారు అత్తయ్య నేను అనుకున్న పని జరగాలని దేవుని కోరుకుంటాను అని అంటుంది కృష్ణ. నువ్వు ఏం కోరుకున్నా అది జరుగుతుందమ్మా అని రేవతి అనగా మీ అత్తా కోడలు ముచ్చట్లు అయిపోతే కృష్ణ నువ్వు ఇంక బయలుదేరు అని అంటుంది భవాని. కృష్ణ లోపలికి వెళ్తుంది ఇప్పుడు ఏమైంది అక్కయ్య తను ఏదో మంచి జరగాలని కోరుకుంటుంది. అందుకే నేను ఆశీర్వదించాను అని రేవతి అనగా,  జరగదు అది అనుకున్నది జరగదు నేను అనుకున్నదే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భవాని. తర్వాత సీన్లో కృష్ణ గదిలోకి వస్తుంది. ఇప్పటివరకు స్నానం ఎందుకు చేయలేదు అని మురారిని అడుగుతుంది. నువ్వు వచ్చిన తర్వాత నిన్ను కలిసి చేద్దామని అంటాడు మురారి.


ఏంటి సార్ ఈ మధ్య డబల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతున్నారు అని అనగా ఏమీ లేదు అని అంటాడు మురారి.అయినా వస్తానని చెప్పి మధ్యలోనే వెళ్లిపోయారు కదా ఏదైనా పనిని అలా పోస్ట్ పోన్ చేస్తే నాకు నచ్చదు అని అంటుంది కృష్ణ. అయితే రేపు కానిద్దాము రేపు అస్సలు పోస్ట్ పోన్ చేయను అని అంటాడు మురారి. తర్వాత మురారి మంచం మీద జారబడి ఉండగా అనుకోకుండా కృష్ణ పక్కన ఉన్న స్టూల్ ని తన్నుకొని మురారి మీద పడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో కృష్ణ లేచి సారీ అని చెప్పి అక్కడి నుంచి సిగ్గుతో వెళ్ళిపోతుంది. మురారి కూడా స్నానానికి వెళ్లి వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో రేవతి తన భర్త దగ్గరికి వచ్చి ఇంట్లో అందరూ ఏదో దాస్తున్నారు.

అక్క ప్రవర్తన తేడాగా ఉన్నది అని అనగా ఒక మంచి జరగాలంటే మంచివాళ్లు కూడా చెడ్డవాళ్ళు లాగే కనిపిస్తారు. నీకు ఏమీ తెలీదు మేము అంత మంచికే చేస్తున్నాము అని అంటాడు. అంటే మీరు ఏదో దాస్తున్నారు అదేంటో నాకు చెప్పండి అని రేవతి అనగా తన భర్త, నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు అంతకుమించి అడగవద్దు అని అంటాడు. మీరు కృష్ణకు ఏమైనా అన్యాయం జరిగేటట్టు చూస్తే వంటింటి కుందేలుగా ఉండే నేను శివంగిలా మారతాను జాగ్రత్త అని చెప్తుంది రేవతి. అంతా నోటి వరకే గానే చేతల వరకు ఏం చూపించలేవులే అని కోపంగా అంటాడు తన భర్త. ఆ తర్వాత సీన్లో ముకుంద, భవాని దగ్గర కూర్చుని ఉంటుంది. అదే సమయంలో కృష్ణ, మురారి బయటకు బయలుదేరుతారు.

చూశారా అత్తయ్య గారు కృష్ణ మురారిని కొంగున ఎలా తీసుకొని వెళ్ళిపోతుందో అని అనగా భవాని చూస్తూ, మురారి నేను నీకు ఒక పని అప్పచెప్పాను అది ఎంతవరకువచ్చింది అని అనగా చెప్పాను కదా పెద్దమ్మ ఆ పనిని ఇంక నాకు వదిలేయండి అని అంటాడు మురారి. మరి కృష్ణ నిన్ను కొంగు పట్టుకొని తీసుకొని వెళ్తుంది ఎక్కడికో ఇంత అర్జెంటా అంటుంది ముకుంద. నాకు కావాల్సిన వస్తువులు కొనడానికి తీసుకెళ్తున్నాను అని అంటుంది కృష్ణ. ఏంటో ఆ వస్తువులు అని భవాని అడుగుతుంది. క్లిప్పులు, సవరాలు, పిన్నులు అని లిస్టు చెప్తూ ఉండగా ఛీ ఛీ ఇలాంటి చిన్న చిన్న వాటి కోసం ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని తీసుకొని వెళ్తావా అని ముకుంద అడుగుతుంది. నా మొగుడిని నేను తీసుకెళ్తే నీకెందుకు నొప్పి అని చెప్పి అక్కడి నుంచి మురారిని తీసుకొని వెళ్ళిపోతుంది కృష్ణ.
 

అయినా తన భర్త తనతో వెళ్తే నువ్వెందుకు అలా అవుతున్నావు అని భవాని, ముకుందని అడుగుతుంది. ఇప్పుడు మురారి కృష్ణకు నిజం చెప్పేస్తే పరిస్థితి ఏంటి అని రేవతి భర్త అనగా వాడి మీద నాకు నమ్మకం ఉంది నాకు మాట ఇచ్చాడు అంటే కచ్చితంగా విషయం చెప్పడు అని అంటుంది భవాని. ఆ తర్వాత సీన్లో మురారి, కృష్ణ ఇద్దరు కాఫీ షాప్ లో కూర్చొని కొంచెంసేపు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కృష్ణ నిన్న మిమ్మల్ని పెద్ద అత్తయ్య గారు ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. నందిని పెళ్లి గురించి చెప్తే నువ్వు ఆనంద పడతావు కృష్ణ కానీ పెద్దమ్మ చెప్పొద్దు అని అన్నది పెళ్లప్పుడు నేనే నీకు సప్రైజ్ ఇస్తాను అని మనసులో అనుకుంటూ పోలీస్ పనులే కాదు కంపెనీ పనులు కూడా చూడమనడానికి పిలిచారు అని అంటాడు మురారి.

ఆవిడ మంచివారు అని మీరు అనుకుంటున్నారు కానీ ఆవిడ చేసిన అన్యాయం నాకు మాత్రమే తెలుసు చెప్తే మీరు కూడా నమ్మరు అని అనుకుంటుంది కృష్ణ. ఇంతకీ వాళ్ళిద్దరూ ఏరి పెళ్లి చేద్దాము అన్నావు కదా అని అడుగుతాడు మురారి. వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నారు నేను త్వరలోనే మీకు విషయం చెప్తాను అని అంటుంది కృష్ణ. తరువాయి భాగంలో గౌతమ్ అక్కడికి వస్తాడు. మీరు పెళ్లి చేయాల్సినది గౌతమ్ సర్ కి అని అనగా అవతల వారికి ఎలాంటి బ్యాగ్రౌండ్ ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు నేనే దగ్గరుండి పెళ్లి చేస్తాను వచ్చేవారమే ముహూర్తం ఉన్నది అని అంటాడు మురారి.

Latest Videos

click me!