దేవాలయాల్లో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు,కారణం అదేనా?

 కుటుంబంతో క‌లిసి మంగ‌ళూరు వెళ్లిన తారక్.. అక్క‌డ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాడు.  

Devara, ntr, rrr, koratala shiva, tollywood


తన  ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నటుడు ఎన్టీఆర్‌ (NTR) శనివారం కర్ణాటక వెళ్లిన విషయం తెలిసిందే. కర్ణాటక హీరో రిషబ్‌ శెట్టి (Rishab Sheety), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel)తో కలిసి ఆ రాష్ట్రంలోని పలు ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఆయన కొల్లూరులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ ఇలా దేవాలయ సందర్శనాలకు రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు నెటిజన్లు.  వివరాల్లోకి వెళితే..


జూ.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క ప‌ర్య‌ట‌న‌లో ఉన్నాడు. కుటుంబంతో క‌లిసి మంగ‌ళూరు వెళ్లిన తారక్.. అక్క‌డ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తార‌క్‌తో పాటు అత‌డి వెంట 'కాంతార' ఫేమ్ న‌టుడు రిష‌బ్ శెట్టి, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు.  శ‌నివారం సాయంత్రం త‌న అమ్మ కోరిక మేర‌కు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను ద‌ర్శించుకున్న తార‌క్.. ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లాడు.



 ఉద‌యం పంచెక‌ట్టులో ఆల‌యానికి వెళ్లిన తార‌క్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంత‌రం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తార‌క్‌తో పాటు రిష‌బ్ శెట్టి, ప్ర‌శాంత్ నీల్ కూడా మూకాంబిక అమ్మవారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Actor Junior NTRs Devara film update out


ఇక దేవాలయ ప్రాంగణంలో ఎన్టీఆర్‌ కన్నడ మీడియాతో మాట్లాడారు. ‘‘రిషబ్‌ శెట్టితో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉంది. ఆలయంలో సినిమా అప్‌డేట్‌లపై స్పందించాలని లేదు. దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయి’’ అని బదులిచ్చారు.

Junior NTR Devaras advance collection report out


అలాగే ఎన్టీఆర్ ఇలా దేవాలయ సందర్శనాలకు కారణం దేవర సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ అతని తల్లి పట్టుబట్టి తీసుకెళ్లటమే అంటున్నారు. దేవర ఇప్పుడు ఎన్టీఆర్ కు అతి పెద్ద సోలో ప్యాన్ ఇండియా చిత్రం. ఆర్.ఆర్.ఆర్ వంటి సూపర్ హిట్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఎన్టీఆర్ కు ఓ రకంగా ప్యాన్ ఇండియా ఎంట్రికు టెస్ట్ లాంటిది. అలాగే దేవాలయ సందర్శనతో ఒక్కసారిగా మీడియాలో ఎన్టీఆర్ పైనా, దేవరపైనా ఎటెన్షన్ వచ్చే అవకాసం ఉంది. ఎన్టీఆర్ మాత్రమే దేవరకు సోలో ఫేస్ అనేది మాత్రం నిజం.

ntr, devara, koratala siva, Janhvi Kapoor

'దేవర' సినిమా చేసిన తారక్.. సెప్టెంబరు 27న థియేటర్లలో ఈ సినిమాతో పలకరించనున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తాడు. కొన్నిరోజుల క్రితం పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఇక నవంబరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచి తారక్ షూట్‌లో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో కలిసి కర్ణాటకలోని దేవాలయాల్ని ఎన్టీఆర్ సందర్శించడం వైరల్ అవుతోంది.  

Junior NTR


దేవాలయ సందర్శన సమయంలో  ఓ  మీడియా విలేకరి.. ‘‘కాంతార’ ప్రీక్వెల్‌లో మీరు యాక్ట్‌ చేస్తున్నారంటూ నేషనల్ మీడియాలో గత కొన్నిరోజులుగా కథనాలు వస్తున్నాయి. ఆవార్తల్లో నిజమెంత?’’ అని ప్రశ్నించగా.. ఎన్టీఆర్‌ నవ్వుతూ బదులిచ్చారు. ‘‘రిషబ్ శెట్టినే దానిని ప్లాన్‌ చేయాలి. ఆయన ప్లాన్‌ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా’’ అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్ చెప్పిన సమాధానం ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంది.

Latest Videos

click me!